ప్రకృతి సేద్యం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యం పరిశీలన

Jul 7 2026 11:51 PM | Updated on Jul 7 2026 11:51 PM

శాంతిపురం: సహజ సిద్ధ పద్ధతులతో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయ పొలాలను అమెరికాలోని ప్రెస్టిషియన్‌ యూనివర్సిటీ విద్యార్థుల బృందం పరిశీలించింది. మంగళవారం శాంతిపురం మండలంలోని ఎంకేపురం, రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి, పెద్దగానూరు వద్ద వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. రైతు సాధికార సంస్థ, ఏపీ సీఎన్‌ఎఫ్‌ల సహకారంతో సాగులోని ఈ తోటల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గో ఆధారిత వ్యవసాయ విధానాలు, ఘన, ద్రవ జీవామృత తయారీలపై ఆరా తీశారు. ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులకు ప్రకృతి సేద్యమే మేలని వారు చెప్పారు. భవిష్యత్తులో రసాయన రహిత వ్యవసాయ దిగుబడులకు మాత్ర మే ఆదరణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలలో డీపీఎం అమృతవల్లి, నోడల్‌ అధికారి బాజీబాబు, ఏఎంసీ చేర్మెన్‌ రాజు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement