● వేడుకగా స్నపన తిరుమంజనం ● ముగిసిన వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు
కార్వేటినగరం: కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం ఉదయం చక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేశారు. చూర్ణాభిషేకం చేపట్టారు. అనంతరం రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని ఊరేగింపుగా స్కంధపుష్కరణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ ఉత్సవర్లతో పాటు చక్రతాళ్వార్‌కు వేద పండితులు వేదమంత్రాల నడుమ స్నపన తిరుమంజనం చేశారు. తదుపరి చక్రస్నానం చేయించారు. సాయంత్రం ఉభయ నాంచారులతో వేణుగోపాలుడు తిరుచ్చి వాహనంపై ఆశీనులై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం కంకణబట్టర్ మురళీకృష్ణకు టీటీడీ ఆనవాయితీ ప్రకారం అందించిన పట్టు వస్త్రాలను టీటీడీ అధికారులు బహూకరించారు. డెప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డి, పాల్గొన్నారు.
నేడు పుష్పయాగం
ఆలయంలో సోమవారం ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల మధ్య పుష్పయాగం చేపడతామని ఆలయ అధికారి చంగల్‌రాజు తెలిపారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం ఉంటుందని తెలిపారు.


