కిక్కిరిసిన కాణిపాకం | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన కాణిపాకం

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

– 8లో

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనానికి శనివారం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

మనసును కలచివేశాయి

రోడ్డు ప్రమాదా లు, బిడ్డకు ఆరోగ్యం బాగలేదని, అమ్మకు ఆపరేషన్‌ అంటూ చాలా మంది బ్లడ్‌ కోసం అల్లాడుతున్నారు. మా స్నేహితులే చాలా మంది రక్తం దొరక్క ఇబ్బంది పడ్డారు. ఈ విషయాలు మనసును కలచివేశాయి. అందుకే రక్తదానం చేయడం ప్రారంభించా. ఇప్పటి వరకు 15 సార్లు రక్తం దానం చేశా. అలాగే ట్రస్టు ద్వారా నాలుగేళ్లుగా జనవరి 26వ తేదీన రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నా. ఏటా 100 యూనిట్లకు తగ్గకుండా రక్త సేకరణ చేయిస్తున్నాను. ఈసారి కూడా 160 యూనిట్ల రక్తం సేకరించి..నిధికి అందజేశా.

– మనోజ్‌రెడ్డి, రక్తదాత, చిత్తూరు

అపోహలు వద్దు

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొందరిలో రక్తదానంపై అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే బలహీనత వస్తుందని, ఆరోగ్యం దెబ్బతింటుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ అపోహలను ఎవరూ నమ్మవద్దు. ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానం చేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది యువకులు క్యాంపులు ఏర్పాటు చేసి రక్తం సేకరించి బ్లడ్‌ బ్యాంకులకు అందిస్తున్నారు. వారి సేవలు అబినందనీయం.

– అమరనాథ్‌,

రక్తనిధి మెడికల్‌ ఆఫీసర్‌, చిత్తూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement