బంకుల మూతపై వైఎస్సార్‌ సీపీ ధ్వజం | - | Sakshi
Sakshi News home page

బంకుల మూతపై వైఎస్సార్‌ సీపీ ధ్వజం

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

● చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా పలు పెట్రోల్‌ బంక్‌ల మూత ● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు ● పొరుగు రాష్ట్రంలోని పెట్రోల్‌ బంకుల వద్ద జిల్లా వినియోగదారులు ● పెట్రోల్‌, డీజిల్‌ కష్టాలపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

తప్పిదాలు చేయొద్దు
గ్రామాల్లో వివక్ష, కక్ష సాధింపులకు పాల్పడ కుండా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు.

తమిళనాడు, కర్ణాటకలో ఫుల్‌గా పెట్రోల్‌, డీజిల్‌

బాబు కుటుంబానికి సాయం

కూటమి ప్రోద్భలంతో, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బాబు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది.

మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

నగరి – తిరుపతి రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద బారులు తీరిన వాహనదారులు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇంధన కొరత వేధిస్తోంది. మూడు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు నిండుకోవడంతో వాహనచోదకులు, యజమానులు ఇక్కట్లు పడుతున్నా రు. జిల్లాలో పలు పెట్రోల్‌ బంకుల వద్ద నోస్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. అరకొర గా ఉన్న బంకుల వద్ద ఆయిల్‌ కోసం బారు లు తీరుతున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. తీరా పంపు వద్దకు చేరుకునే సరికి వారు అడిగినంత పెట్రోల్‌ లేదా డీజిల్‌ పట్టకపోవడంతో జనం నిరాశ చెందుతున్నారు.

జిల్లాలో పెట్రోల్‌,

డీజిల్‌ కొరత లేదు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో పెట్రో ల్‌, డీజిల్‌ కొరత లేదని ప్రజలు, రైతులు, వాహనదారులు ఆందోళన చెందొద్దని ఎస్పీ తుషార్‌డూడి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ స్పష్టం చేశారు. చిత్తూరులోని పలు పెట్రోల్‌ బంక్‌లను ఆదివారం రాత్రి ఎస్పీ, కలెక్టర్‌ సంయుక్తంగా తనిఖీ చేశారు. ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, విక్రయ విధానాలను పరిశీలించారు. బంక్‌ నిర్వాహకులకు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పెట్రోల్‌ బంక్‌లలో డీజిల్‌, పెట్రోల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇంధన విక్రయాలను నిలిపివేసినా, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడినా, సోషల్‌ మీడియా లో అసత్య ప్రచారాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందని తెలిపారు. బంక్‌ నిర్వాహకులు పారదర్శకంగా విక్రయాలు నిర్వహించి వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఎవరైనా ఇంధనాన్ని బ్లాక్‌ చేయడం, నల్లబజారులో విక్రయించడంలాంటివి చేస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్‌ 112కు సమాచారం అందించాలని సూచిచంఆరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ తనిఖీలలో ఏఎస్పీ డా.తరుణ్‌ పహ్వా, టూ టౌన్‌ సీఐ నెట్టికంటయ్య పాల్గొన్నారు.

నేడు కరెంటోళ్ల జనబాట

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమో దు చేసుకొని, పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు.

బాధ్యతను మరువొద్దు

చిత్తూరు అర్బన్‌: పోలీసుశాఖలో అంతర్భాగంగా ఉన్న హోంగార్డులు బాధ్యతతో పనిచేయా లని రాయలసీమ ప్రాంతీయ హోంగార్డుల కమాండెంట్‌ మహేష్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డుల దర్భార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా హోంగార్డులు పనిచేయాలన్నారు. రోడ్డు భద్రత, బందోబ స్తు, శాంతి భద్రతల పర్యవేక్షణపై పట్టు ఉండాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ద్విచ్ర వాహనా లు నడిపే సమయంలో హెల్మెట్లు ధరించాలన్నారు. పలువురు హోంగార్డుల నుంచి వినతు లు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ చిన్నికృష్ణ, హోంగార్డు డీఎస్పీ చిరంజీవి, ఆర్‌ఐ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, తిరపతి జిల్లాల వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. వాహన చోదకులకు పెట్రోల్‌, డీజిల్‌ దొరక్క వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇంటింటా పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో ఇక్కట్లు పడుతున్నారు. తిరుపతి జిల్లాలో 185 పెట్రోల్‌ బంకులున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం సోమవారం సగానికిపైగా మూతపడ్డాయి. అధికారులు మాత్రం కేవలం 25 పెట్రోల్‌ బంకులు మాత్రమే మూతపడ్డాయని చెప్పుకొచ్చారు. ఆదివారం 15 పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఎక్కువే. అధికశాతం బంకులు మూతపడడంతో ఉన్న బంకుల వద్ద వినియోగ దారులు బారులు తీరారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతను దృష్టిలో ఉంచుకుని కొన్ని బంకుల్లో అధికధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవడం కనిపించింది. తిరుపతికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి రూ.200 ఇస్తే..బంకులోని వ్యక్తి లీటర్‌ పెట్రోల్‌ పట్టి రూ.30 తిరిగి చేతికి ఇచ్చాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ‘అంతే వెళ్లు’ అంటూ సమాధానం ఇచ్చాడని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పలు పెట్రోల్‌ బంకుల వద్ద కనిపించింది.

చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి

చిత్తూరు జిల్లాలో చమురు కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ తిరుపతి జిల్లా పరిస్థితే నెలకొంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 146 పెట్రోల్‌ బంక్‌లున్నాయి. ఇప్పటి వరకు సుమారు 30 పెట్రోల్‌ బంక్‌ల వరకు మూతబడ్డాయి. ప్రధానంగా పలు బంక్‌ల్లో డీజిల్‌ కొరత కనిపిస్తోంది. మరికొన్ని బంక్‌ల్లో డీజిల్‌ ఉన్న రూ.200కు మించి పట్టడంలేదు. దీంతో వాహనచోదకులు అల్లాడిపోతున్నారు. ఇక పలు బంక్‌ల్లో వాహనాలు కిక్కిరిస్తున్నాయి. డీజిల్‌ కోసం వాహన యజమానులు పడిగావులు కాస్తున్నారు. సరఫరాలో లోటు కనిపిస్తోంది. డీజిల్‌, పెట్రోల్‌ కోసం గంటల కొద్ది నిరీక్షిస్తున్నారు.

ఆగిన ఆటోలు

పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లి, వచ్చే ఆటోలు పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా రోడ్డు పైకి ఎక్కడం లేదు. ఆటోలు రాకపోవడంతో అనేక మంది పల్లె ప్రాంత వాసులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. ఫలితంగా సోమవారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు జనంతో కిక్కిరిసిపోయాయి. అత్యవసరం అనుకున్న వారు ఆటో, టాక్సీలను ఆశ్రయించారు. వారు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అద్దె ధరలు అమాంతం పెంచి అడుగుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ దొరకడం లేదని, తామూ బ్లాక్‌లో కొనుగోలు చేసుకున్నామని సమాధానం చెబుతున్నారు.

చిరువ్యాపారులకు తిప్పలు

ఆటోలు పల్లె ప్రాంతాల వైపు రాకపోవడంతో అనేక మంది చిరు వ్యాపారులు, కూరగాయలు తీసుకొచ్చేవారు, పెద్ద మార్కెట్‌కు వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లే వారు సైతం తిరుపతి రావడం మానేశారు. స్థానికంగానే కూరగాయలను గ్రామాల్లో తిరిగి తక్కువ ధరకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రయాణం రద్దు చేసుకున్నా

ఏర్పేడు: మా బంధువుల పిల్లలకు పుట్టెంట్రుకలు తీసే శుభకార్యానికి సోమవారం ఇంటి సొంత ఆటోలో భార్యతో కలసి బయల్దేరాను. దుర్గిపేరి పెట్రోల్‌ బంకు వద్ద నోస్టాక్‌ బోర్డు కనిపించింది. అక్కడ నుంచి ఏర్పేడు వైపు బయల్దేరి ఐఐటీ సమీపంలో ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకు వద్ద ఆటోకు డీజిల్‌ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అక్కడా లేదు. దీంతో ఆలోచనలో పడ్డాను. ట్యాంకులో ఉన్న కొంత డీజిల్‌తో అంత దూరం వెళ్లి రావటం అసాధ్యమని భావించి మా ప్రయాణం రద్దు చేసుకున్నాను. – సుబ్రమణ్యం, పల్లంపేట, ఏర్పేడు మండలం

మూడు రోజులుగా ఇంటికే పరిమితం

తిరుపతి తుడా: రోజూ ఆటో నడిపితేనే కుటుంబం జీవనం సాగుతుంది. కానీ మూడు రోజులుగా డీజిల్‌ కొరతతో ఆటో ఇంటికే పరిమితమైంది. పెట్రోల్‌ బంకుల వద్ద కిలోమీటర్‌ మేర క్యూలైన్‌ ఉంది. క్యూలైన్‌లో 5 గంటల పాటు వేచి ఉన్నా కేవలం ఒక వెహికల్‌కు రూ.100 మాత్రమే డీజిల్‌ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఆటో ఈఎమ్‌ఐ కట్టాలి, ఇంటికి నిత్యావసరాలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. – రాము, ఆటో డ్రైవర్‌, తిరుపతి

డీజిల్‌ దొరక్క ఇంటి వద్దే ఉంచా

రైల్వేకోడూరు అర్బన్‌ : నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. డీజిల్‌ దొరక్క ఆటో ఇంటివద్దే ఉంచుకున్నా. ఒక వేళ ఉన్నా పెట్రోల్‌ బంక్‌ల వద్ద గంటల తరబడి ఉండాల్సివస్తోంది. అందువల్ల ఆటోను నడపకుండా ఉన్నాను. ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేకుండా చూడాలి.

– సుబ్రమణ్యం, రాఘవరాజపురం అరుంధతివాడ

ఎనిమిది టన్నుల

కూరగాయల వితరణ

పలమనేరు: తిరుమలలోని నిత్యాన్నదాన పథకానికి పట్టణానికి చెందిన పూసల రవి ఆధ్వర్యంలో ఎనిమిది టన్నుల కూరగాయలను స్థానిక మార్కెట్‌ నుంచి సోమవారం తరలించారు. ఈ సందర్భంగా కూరగాయల వాహనానికి గోవిందనామ స్మరణల మధ్య పూజలు చేపట్టారు. ఇందులో మదనపల్లి ఏఎంసీ చెర్మన్‌ శివరామ్‌, ఆకుల గజేంద్ర, బాబు, వేణుగోపాల్‌నాయుడు, మండీ యజమానులు పాల్గొన్నారు.

ఆకలి కేకలు వినిపించలేదా?

సరిహద్దు పెట్రోల్‌ బంకుల్లో కొనుగోలు

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ దొరక్కపోవడంతో స్థానికులు అనేక మంది సరిహద్దులోని తమిళనాడులో ఉన్న పళ్లిపట్టు, తిరుత్తణి, ఊత్తుకోట, ఆరంబాకం పెట్రోల్‌ బంక్‌లకు చేరుకుని, వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించుకుని తిరిగి రావడం కనిపించింది. ముందు జాగ్రత్తగా వాటర్‌ బాటిళ్లు, క్యాన్లలో కూడా పెట్రోల్‌, డీజిల్‌ నింపుకుని తిరిగి జిల్లాకు చేరుకుంటున్నారు. అధికారులు సైతం కొందరు తమిళనాడు పరిధిలోని పెట్రోల్‌ బంకులకు వెళ్లి కొనుగోలు చేయడం కనిపించింది.

అన్నదాతలకు అవస్థలు

వ్యవసాయ పనులకు ట్రాక్టర్లను వినియోగించే రైతులకు పెట్రోల్‌, డీజిల్‌ కష్టాలు తప్పలేదు. రేణిగుంట మండలం వెంకటాపురంలో ఓ రైతు వరి నాట్లు వేసేందుకు ట్రాక్టర్‌తో దుక్కి సిద్ధం చేసేపనిలో నిమగ్నమయ్యారు. దుక్కి దున్నతుండగా డీజిల్‌ లేక మధ్యలోనే ట్రాక్టర్‌ ఆగిపోయింది. చేసేది లేక పొలంలోనే ట్రాక్టర్‌ని విడిచి డీజిల్‌ కోసం బంకుల చట్టూ తిరిగారు. డీజిల్‌ కొరత కారణంగా సొమవారం పనులు ముందుకు సాగలేదు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేద్యం కోసం వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్‌ కొరత కారణంగా ఎక్కడివక్కడే ఆగిపోయాయి.

పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా తిరుపతిలో అనేక బంకులు మూతపడ్డాయి. వినియోగ దారుల ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు నియోజక వర్గ సమన్వయకర్తలు భూమన అభినయరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోటి రాజేష్‌, విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి నగరంలో పలు పెట్రోల్‌ బంకులను పరిశీలించి వినియోగ దారుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడిందని ధ్వజమెత్తారు.

డీజిల్‌ లేదని ఆటోలు పోలే..

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: డీజిల్‌ లేదని ముసిలిపేడుకు ఆటోలు పోలే. అందుకే బస్టాండుకు వ చ్చాను. ఎపుడు ఈ మాదిరిగా లేదు. వచ్చే దారిలో చూస్తూ వచ్చినాను. ఆటోవాళ్లంతా వరుసగా పెట్రోల్‌ బంకుల వద్ద నిలబెట్టినారు. వాళ్ల కోసం కూచుంటే కాదని బస్సు ఎక్కేందుకు వచ్చినాను.

– నాగరాజు, ప్రయాణికుడు, మునగళపాళెం

తిరుమలకు బస్సెక్కాల్సిందే..

తప్పదు మరి తిరుమల శ్రీవారి దర్శనం కోసం బస్సు ఎక్కాల్సిందే. జీపుల్లో వెళ్లతామని అనుకున్నాం. డీజిల్‌ కొరత కారణంగా అవి కాస్తా పె ట్రోల్‌ బంకుల వద్దకు వెళ్లి క్యూలైన్‌లో ఉన్నాయి. ఎప్పడికి క్యూలైన్‌ పూర్తవతుందో తెలియని పరిస్థితి. జీపుల కోసం వేచి ఉండాలంటే జరగని పని. అందుకే అలిపిరి బాలాజీ బస్టాండ్‌కు చేరాం. – ఓ. నారాయణ, శ్రీవారి భక్తుడు,

సదుం మండల కేంద్రం

ఈ పరిస్థితి ఎప్పుడు చూడలేదు

నేను తిరుపతిలోనే ఆటో నడుపుతాను. ఎప్పుడు డీజిల్‌ కోసం ఇబ్బందులు పడిందిలేదు. మూడు రోజులుగా కొరత ఏర్పడింది. నా ఆటోలో రాత్రి 10 గంటలకు ఆటోలో డీజిల్‌ అయిపోయింది. అన్ని బంకులు తిరిగాను. అయితే కేటీ రోడ్డులోని పెట్రోల్‌ బంకు వద్ద డీజిల్‌ పడుతున్నారని తెలుసుకుని ఆటోను తోసుకుని ఉదయం 10 గంటల నుంచి క్యూలైన్‌లో ఉన్నాను. ఇపుడు మధ్యాహ్నం 1.30 అవుతోంది. ఇంకా ఎంత సమయం పడుతోందని ఎదురు చూస్తున్నా.

– వెంకటేశ్వర్లు, ఆటో నిర్వాహకుడు, తిరుపతి

నారు ఎండిపోతోంది..

ఖరీఫ్‌ సీజన్‌లో వరినాట్లు వేయాలి. నార్లు పోసుకుని ఉన్నా. నాట్లు వేయాలంటే పొలం దు క్కి చేయాలి. దుక్కి చే యాలంటే రోటావేటర్‌కు డీజిల్‌ అవసరం. డీజిల్‌ లేక రోటావేటర్‌ను పక్కన పెట్టేసి ఎదురు చూస్తున్నా. రెండు రోజుల్లో నాట్లు వేయకపోతే నారు ఎండిపోతుంది. ఉన్నట్టుండి డీజిల్‌ ఇంత ఇబ్బంది వస్తుందనుకోలేదు. లేదంటే ముందుగా అయినా తెచ్చుకుని ఉండేవాళ్లం. ఉన్నట్టుండి ఇబ్బంది రావడంతో రైతుగా నాకు నష్టమే మరి..

– దిరసాల మురళి, వద్దిగుంట కండ్రిగ,

నాయుడుపేట మండలం

Advertisement
 
Advertisement
Advertisement