ఫలితం రాగానే అతిగా స్పందించకూడదు. ప్రశాంతంగా ఆలోచించాలి.
మార్కులు తక్కువ వచ్చాయని ప్రాణాలు తీసుకోవడం వంటి ఆలోచనలు చేయకూడదు. మీ వెనుక కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలి.
సప్లిమెంటరీ పరీక్షలు, రీ వెరిఫికేషన్ వంటి అనేక అవకాశాలు ఉంటాయన్న విషయాలను గుర్తించుకోవాలి.
నచ్చిన రంగంలో రాణించేందుకు వేలాది దారులు ఉన్నాయి.
ఫలితం రాగానే విద్యార్థుల ముఖంలో భయం కనిపిస్తే తల్లిదండ్రుల ప్రేమగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పాలి.
విద్యార్థులు, తల్లిదండ్రులు
సంయమనం పాటించాలి
పరీక్షలే జీవితం కాదు
త్వరలో పది పబ్లిక్ పరీక్షల ఫలితాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ గ్రేడ్ వస్తుంది? ఇంట్లో ఏమంటారు? స్నేహితుల కంటే తక్కువ మార్కులు వస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలు వేలాది మంది విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, విద్యార్థులు ఒక్క విషయం గుర్తించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిభను నిర్ణయించేది ఒక పేపర్ మీద ఉండే అంకెలు కాదు, ప్రతి విద్యార్థిలో ఉండే పట్టుదల, పోరాట గుణమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మార్కులే జీవితం కాదనే అంశంపై పిల్లలను చైతన్యపరచాల ని మేథావులు, విద్యావేత్తలు అంటున్నారు. పలు కారణాలతో పరీక్ష తప్పిన వారు క్షణికావేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదని, మార్కులే జీవితం కాదని సూచిస్తున్నారు. ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలి మెట్టులాంటిదని అంటున్నారు. పరీక్షల్లో ఎందుకు తప్పాం? లోపం ఎక్కడ ఉంది? అనే అంశాలను విశ్లేషించుకుని అడుగు ముందుకేస్తే అడ్వాన్‌న్డ్స్ సప్లిమెంటరీలో తిరిగి ఉత్తీర్ణత సాధిస్తారని అంటున్నారు.
14416 నంబర్ ఉందిగా..
తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ టెలిమానస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 14416 నంబరుకు ఫోన్ చేసి కుంగుబాటు, మానసిక ఆందోళన, నాకు జీవితం ఎందుకు అని అనిపించినా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చుట్టుముడుతున్నా వెంటనే టెలిమానస్‌కు ఫోన్ చేస్తే.. కౌన్సిలర్లు ఫోన్‌న్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారు.
తల్లిదండ్రులూ ఆలోచించండి
ఫలితం ఎలా వచ్చినా.. ఆత్మన్యూనతా భావంతో మానసిక స్థైర్యం కోల్పోరాదు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చరాదు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ముందున్న విస్తృత అవకాశాలు తెలిసే అవకాశముంటుంది. ఓటమి కూడా భవిష్యత్‌లో సాధించబోయే విజయానికి తొలిమెట్టు. పాస్, ఫెయిల్ సాధారణ విష యాలే అయినా వ్యక్తిగత ప్రతిష్టకు పోయి తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయరాదు. విద్యార్థులు సైతం ప్రతికూలంగా ఉన్న ఫలితాలపై ఎలాంటి ఆందోళన చెందకుండా పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు.
ఫెయిల్ అంటే ఓడిపోవడమా?
ఫెయిల్ అంటే ఎప్పటికీ ఓడిపోవడం కాదు. విజయాన్ని ఇంకా అందుకోలేదని అర్థం. గెలుపునకు తగినంత సన్నద్ధత కాలేదని అర్థం. ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రయత్నాలన్నీ గెలుపు లక్ష్యంగానే మొదలు పెడతాడు. ఆ ప్రయత్నాల్లో విజయాలే కాదు ఓటమి కూడా ఎదురవుతుంది. ఈ విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు ఓటమిని తప్పనిసరిగా అంగీకరించాల్సి వస్తుంది. ఓటమి విజయానికి తొలిమెట్టు అనే మాటను మరచిపోకూడదు.
నిపుణుల సూచనలు
జిల్లా సమాచారం
పరీక్ష కేంద్రాలు 129
బాలురు (రెగ్యులర్) 10,737
బాలికలు (రెగ్యులర్) 10,264
బాలురు (ప్రైవేట్, వన్స్‌ఫెయిల్డ్) 1,318
బాలికలు (ప్రైవేట్, వన్స్‌ఫెయిల్డ్) 726
మొత్తం విద్యార్థులు 23,095
ఓటమి విజయానికి
తొలిమెట్టు
ఫలితం ఏదైనా..!
జీవితం అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఇందు లో పదో తరగతి అనేది కేవలం ఒక చిన్న మైలురాయి మాత్రమే. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను 129 కేంద్రాల్లో 21,062 మంది విద్యా ర్థులు రాశారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. గతేడాది పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23న ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో మరి కొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడనున్నట్లు సమాచారం. ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఫలితం ఆశించిన ట్లు లేకపోతే నిరాశ చెందకూడదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ కీలక సమయంలో విద్యార్థుల కంటే తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకం. పిల్లలను మరొకరితో పోల్చి వారిలో ఉన్న న్యూన తా భావాన్ని దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు.


