గంగాధరనెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గంగాధర నెల్లూరుకు మండలానికి చెందిన బాబు కుటుంబానికి వైఎస్సార్‌సీసీ నేతలు అండగా నిలిచారు. గంగాధర నెల్లూరు పంచాయతీ రామానాయుడుపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడైన రైతు బాబుపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అక్రమంగా పలు కేసులు పెట్టారు. బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులు పెట్టారు. దీంతో భరించలేక కొద్దిరోజుల కిందట బాబు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి సోమవారం రామానాయుడుపల్లి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన రూ.లక్ష చెక్కును బాబు సతీమణి గోవిందమ్మ, ఆమె కుమారుడికి అందజేశారు. బాబు కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని నారాయణస్వామి, కృపాలక్ష్మి భరోసా, మండల నాయకులు ఇచ్చారు.
బాబు కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందిస్తున్న నారాయణస్వామి, కృపాలక్ష్మి, బాబు సతీమణి గోవిందమ్మను ఓదార్చుతున్న కృపాలక్ష్మి


