లక్ష్యం దిశగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం దిశగా పనిచేయాలి

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

● పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం దిశగా పనిచేయాలని డీఎంహెచ్‌ఓ నాగశశిభూషణ్‌రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో ఆయన సోమవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల నుంచి అక్టోబర్‌ వరకు మీజిల్స్‌–రుబెల్లా (ఎంఆర్‌) వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. 9 నెలల నుంచి 24 నెలలలోపు వ్యాక్సిన్‌ మిస్‌ అయిన పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. మొదటి విడతగా ఏప్రిల్‌ 27 నుంచి మే 4 వరకు, రెండో విడతగా జూలై 20 నుంచి 27 వరకు, మూడో విడతగా అక్టోబర్‌ 12 నుంచి 19 వరకు కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్నారు. ఎండల తీవ్రత దష్ట్యా వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ కార్నర్‌ ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీలోని 6 బెడ్లలో 2 బెడ్లు హీట్‌ వేవ్‌ కేసులకు కేటాయించాలని చెప్పారు. గర్భిణులు, శిశువులను తప్పనిసరిగా అభా ఐడీతోనే నమోదు చేయాలని, లేకపోతే సంబంధిత ఏఎన్‌ఎంలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్సీడీ కార్యక్రమంలో 50 శాతం పైగా ఫాలోఅప్‌ ఉండాలని, ప్రతిరోజూ ఓపీ సెన్సస్‌ 50కి పైగా అభా ఐడీతో నమోదు కావాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్‌ వెంకటప్రసాద్‌, డాక్టర్‌ హనుమంతరావు, డాక్టర్‌ అనూష, జార్జ్‌, రామ్మోహన్‌ పాల్గొన్నారు.

తప్పిదాలు చేయొద్దు

నిండ్ర (నగరి) : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో ఎలాంటి పక్షపాత ధోరణి చూపకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం నిండ్ర మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతలు స్వీకరించారు. ప్రజల నుంచి 97 వినతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వీఆర్‌వో, కార్యదర్శులు తమ గ్రామ స్థాయిలో పారదర్శకంగా, పక్షపాతం లేకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామాలలో మండల సర్వేలు, వీఆర్వోలు, భూసమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. రీ సర్వే నిర్వహించినప్పుడు పారదర్శకంగా నిర్వర్తించాలన్నారు. ఈ రోజు స్వీకరించిన వినతులలో అధి క శాతం రెవెన్యూ సమస్యలపై వచ్చాయని తెలిపారు. సర్వే చేసినప్పుడు అర్జీదారుని కి ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు గ్రామ సభ నిర్వహించి రీసర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. నగరి, నిండ్ర, విజయపురం, కార్వే టినగరం, పాలసముద్రం మండలాలలో రీ సర్వే పనులు వేగవంతం చేయా లన్నా రు. పీజీఆర్‌ఎస్‌ వినతులను 14 రోజుల్లోపు పరిష్కరించాలని, అందుకు ఆర్డీవో నివే దిక సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అ.రాజేంద్రన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ బన్న వెంకటేష్‌, డీఆర్వో మోహన్‌కుమార్‌, ఆర్డీవో నగరి అనుపమ, జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు 266వ జయంతిలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement