పలమనేరు: పరిచయం పేరిట మోసం చేసిన ఘటన పలమనేరులో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన ఉషా గతంలో పలమననేరులో ఉండేది. ఆపై ఇప్పుడు బెంగళూరులో ఉంటోది. ఈ నేపథ్యంలో చిత్తూరు నుంచి పలమనేరుకు మూడు రోజు క్రితం వస్తూ బస్సు లో కొందరితో పరిచయం పెంచుకుంది. ఆ మేర కు వారితో మాట్లాడుతూ తాను టౌన్‌లోని బొరుగులబట్టి వీధికి వెళ్లాలని చెప్పింది. పలమనేరులో బస్సు దిగాక తాము కూడా ఆ వీధికి వెళ్తామంటూ పరిచయం అయిన వారితోపాటు ఆటోలో వచ్చింది. ఆపై ఏమి జరిగిందోగానీ ఆమె స్ఫృహ కోల్పోయింది. ఆమె వద్ద పర్సులో ఉన్న 30 గ్రాముల బంగారు ఆభరాణలు, రూ.5 వేల నగదును చోరీ చేసి ఆటలోంచి దింపేశారు. ఆపై తెలివిలోకి వచ్చిన బాధితురాలు తాను మోసపోయానంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలో అత్యంత రద్దీగా ఉండే పాత బస్టాండ్‌లోని ఓ మొబైల్ షాప్ లో సోమవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు, పొగ వ్యాపించడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చెరుకుని మంటలను పూర్తిగా అదుపుకోకి తెచ్చారు. సకాలంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆ దుకాణంలోని కొంత ఫర్నిచర్ రూ.10 వేల లోపు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున విద్యుత్ వైరింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు.


