భూతగాదాలపైనే అర్జీలెక్కువ | - | Sakshi
Sakshi News home page

భూతగాదాలపైనే అర్జీలెక్కువ

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

● జిల్లా కేంద్రానికి రావడం ఇబ్బంది అని.. సబ్‌ డివిజన్‌లో గ్రీవెన్స్‌ ● పలమనేరు పోలీస్‌ గ్రీవెన్స్‌లో చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడి

పలమనేరు: భూతగాదాలు, మనీమ్యాటర్లపైనే ఇక్క డ ఎక్కువగా అర్జీలందాయని ఎస్పీ తుషార్‌డూడి పేర్కొన్నారు. ఆ మేరకు పలమనేరు సబ్‌ డివిజనల్‌ పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీసు గ్రీవెన్స్‌డేని నిర్వహించారు. ఈ సందర్భంగా 40 దాకా ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని పరిశీలించి తగు న్యాయం చేస్తామని ఆయన బాధితులకు భరో సా కల్పించారు. అనంతరం విలేకరులతో మాట్లా డుతూ ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పోలీస్‌ గ్రీవెన్స్‌డేకి దూర ప్రాంతాల నుంచి వచ్చేందుకు ఇబ్బందులు పడుతుంటారనే పలమనేరు సబ్‌ డివిజనల్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసింగ్‌ బాగానే ఉందని కితాబిచ్చారు. ముఖ్యంగా ఐపీఎల్‌ బెట్టింగ్‌, సెల్‌ఫోన్ల చోరీ, గంజా స్మగ్లింగ్‌, డిజిటల్‌ మోసాలు తదితరాలపై ఇటీవల కాలంలో బాగా దృష్టి పెట్టామన్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో ప్రజ లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువగా ప్రచారం చేశామన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎంతో మేలుంటుందని సూచించారు. ఇందులో పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌ పలువురు సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement