విచారణ జరిపించాలి | - | Sakshi
Sakshi News home page

విచారణ జరిపించాలి

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

ఎస్వీయూలో రూసా నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక అధికారులను నియమించి విచారణ చేపట్టాలి. ఉన్నత లక్ష్యం కోసం మంజూరైన రూ.కోట్ల నిధులను సక్రమంగా వినియోగంచడంలో అధికారులు విఫలమయ్యారు. వర్సిటీలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు అధికారులు రూసా నిధులను వినియోగించాలి. – చిన్న,

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యుడు,తిరుపతి

శ్వేత పత్రం విడుదల చేయాలి

ఉన్నత లక్ష్యంతో విడదులైన రూసా నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయి. వర్సిటీలోని కొందరు అధికారులు నిధులపై కన్నేశారు. వారి స్వార్థం కోసం నిబంధనలను తుంగలో తొక్కి దుర్వినియోగం చేశారు. అవినీతి ఆరోపణలను అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. నిధుల వినియోగంపై అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలి.

– సుందరరాజు, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు, ఎస్వీయూ

అవినీతి రాజ్యమేలింది

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి రుసా నిధుల్లో అవినీతి రాజ్యమేలింది. కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఖర్చుపెట్టేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టాలని వీసీకి ఫిర్యాదు చేశాం. అయినా పట్టించుకోలేదు. ఖర్చుపెట్టిన ప్రతి పైసాపై లెక్క చెప్పాల్సిందే. కొందరు అనవసర సెమినార్‌లు, సదస్సుల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు. – ప్రేమ్‌ కుమార్‌, వైఎస్సార్‌ సీపీ

విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఎస్వీయూ

నిజానిజాలు తేల్చాలి

వర్సిటీలో రూసా నిధుల దుర్వినియోగంపై వస్తున ఆరోపణలపై నిజానిజాలు తేల్చాలి. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే వర్సిటీ అభివృద్ధికోసం రూసా నిధులను వెచ్చించాల్సిన అధికారులు తమ స్వార్థం కోసం వినియోగించడం దారుణం. రూసా 2.0 ద్వారా నిర్వహించిన సదస్సులు, సెమినార్‌లకు అవసరం కంటే అధిక మొత్తం వెచ్చించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

– శివ బాలాజీ,

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు, తిరుపతి

అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం

స్వలాభం కోసం అధికారులు రూసా నిధులతో తమ అనుచురుల కు వర్సిటీ ఉద్యోగాలు కల్పించడం దారుణం. ఇష్టా నుసారంగా నిధులను దుర్వినియోగం చేస్తూ తమకు అడ్డులేద ని విర్వవీగుతూ వర్సిటీ అభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం. తక్షణం నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి అవినీతికి పా ల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.

– శివశంకర్‌ నాయక్‌, జీఎన్‌ఎస్‌

రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement