● చిత్తూరులో కాలువల నిర్మాణానికి రూ.82 కోట్లు ● మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ
చిత్తూరు అర్బన్: పట్టణాల్లో ప్రతీ ఇంటికి నీటి కొళాయి కనెక్షన్లు ఇచ్చి, నీటిని సరఫరా చేస్తామని.. ఇందుకోసం రూ.14 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని రాష్ట్ర మునిసిపల్ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. సోమవారం చిత్తూరు నగరంలోని పూనేపల్లెలో టిడ్కో గృహాలను పరిశీలించి, నగరంలోని పలు కూడళ్లను సందర్శించారు. కార్పొరేషన్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే జగన్‌మోహన్‌నాయుడు, డీఎంఏ సంపత్‌కుమార్, ఈఎన్‌సీ ప్రభాకర్‌రావుతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ చిత్తూరులో కాలువల నిర్మాణానికి రూ.84 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మురుగునీటి శుద్ధి కోసం రూ.39.21 కోట్లు మంజూరు చేశామన్నారు. కమిషనర్ నరసింహ ప్రసాద్, చుడా చైర్‌పర్సన్ హేమలత, పలువురు అధికారులు పాల్గొన్నారు.


