15 లోపు వివరాలు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

15 లోపు వివరాలు నమోదు చేయాలి

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల నమోదుకు సంబంధించి ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు విద్యాంజలి పోర్టల్‌లో మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల వివరాలను గడువులోపు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ప్రతి హెచ్‌ఎం విద్యాంజలి లాగిన్‌లో పాఠశాలకు అవసరమైన జాబితాను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. తరువాత దాత లు, నేరుగా పోర్టల్‌ ద్వా రా ఆయా పాఠశాలలను ఎంచుకుని సహకారం అందించవచ్చన్నారు. ఈ ప్రక్రియ అత్యంతపారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. విద్యాంజలి పోర్టల్‌ ద్వారా నగదు రూపంలో విరాళాలు స్వీకరించనున్నట్టు తెలిపారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 41 ఫిర్యాదులు

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలోని ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 41 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌ చేయడంతో పాటు నిర్ణీత గదువు లోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు పిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా స్టేషన్‌ హౌస్‌ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖరరాజు, ఈస్ట్‌ సీఐ రామచంద్ర సైతం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

విద్యుత్‌ సమస్యల పరిష్కారం

చిత్తూరు కార్పొరేషన్‌: విద్యుత్‌ సమస్యలను పరిష్కారిస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సోమవారం ఎస్‌ఈ కార్యాలయంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమంలో మాట్లాడారు. నిండ్రలో పాడైన కరెంటు స్తంభాన్ని మార్పు చేసి లైన్‌ను మార్చా లని వినియోగదారులు వెంకటాసుబ్బారెడ్డి తెలిపారు. బంగారుపాళ్యంలో కరెంటు స్తంభం ఏర్పాటు చేయాలని నేతాజీ వినతి చేశారు. మొగిలి, చీలాపల్లెలో అంతరాయం లేని విద్యు త్‌ ఇవ్వాలని నాగేశ్వరరావు, ఢిల్లీప్‌, బైరెడ్డిపల్లెలో వ్యవసాయ సర్వీసు విడుదల చేయాలని జీవశ్రీ తెలియజేశారు. వెదురుకుప్పంలో అదనపు సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని హరినాథరరెడ్డి కోరారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారించాలని ఎస్‌ఈ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement