చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత నెల రోజులుగా సాగుతున్న ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా డీఐఈవో రఘుపతి పకడ్బందీ చర్యలు చేపట్టారు. మార్చి 2 నుంచి కొన్ని సబ్జెక్టుల జవాబుపత్రాలు, మార్చి 22 నుంచి ఎక్కువ శాతం జవాబుపత్రాల మూ ల్యాంకనం చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లా ల నుంచి జిల్లాకు విచ్చేసిన 1.71 లక్షల జవా బు పత్రాలను మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియలో 650 మంది సిబ్బంది పాల్గొన్నారు.
తప్పులు చేస్తే చర్యలు తప్పవు
చిత్తూరు కలెక్టరేట్ : మూల్యాంకనంలో తప్పు లు చేస్తే చర్యలు తప్పవని అబ్జర్వర్ మువ్వారామలింగం హెచ్చరించారు. ఆయన సోమవా రం పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియను పర్యవేక్షించా రు. ఏసీవోలతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలిచ్చారు. అబ్జర్వర్ మాట్లాడుతూ మూ ల్యాంకన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవ్వ రూ ఫోన్ వినియోగించకూడదన్నారు. తప్పిదా లు జరగకముందే జాగ్రత్తలు పాటించాలన్నా రు. ప్రతి రోజు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుందన్నారు. డీఈవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విధులు నిర్వహించే టీచర్లు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. డీవైఈవో ఇందిరా, అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్‌నాయుడు పాల్గొన్నారు.


