రాష్ట్ర స్థాయి ఎక్స్‌పోకు పుత్తూరు బాలికలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి ఎక్స్‌పోకు పుత్తూరు బాలికలు

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

పుత్తూరు: ఎంట్రప్రెన్యూర్షిప్‌ మైండ్‌సెట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగాం (ఈఎండీపీ) రాష్ట్ర స్థాయి ఎక్స్‌పోకు పుత్తూరు బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. విద్యార్థుల్లో వ్యాపార దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో సోమవారం తిరుపతి ఎంజీఎం హైస్కూల్‌లో ఈఎండీపీ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పది పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న ఈఎక్స్‌పోలో పుత్తూరు బాలికల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు పి.ఢిల్లీరాణి, బి.శ్రీలక్ష్మీ ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నారు. సర్వశిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ గౌరీశంకర్‌ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయురాలు కె.వి.శ్యామలత మార్గదర్శకంలో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులు త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఈఎండీపీ ఎక్స్‌పోలో పాల్గొనన్నారు. కార్యక్రమంలో ఈఎండీపీ జిల్లా కో–ఆర్డినేటర్‌ అనిత, జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ భానుప్రసాద్‌, జిల్లా రిసోర్స్‌ పర్సన్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement