అయ్యో..ఘోరం! | - | Sakshi
Sakshi News home page

అయ్యో..ఘోరం!

Apr 7 2026 8:01 AM | Updated on Apr 7 2026 8:01 AM

అర్ధరాత్రి వేళ లారీని ఢీకొట్టిన కారు

ఇద్దరు మృతి, మరో నలుగురికి

స్వల్ప గాయాలు

బెంగళూరులో ఐపీఎల్‌ మ్యాచ్‌

చూసి వస్తూ..

అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీ స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద సడెన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వైపు వస్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బెంగళూరులో ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసుకుని తిరిగి తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలోని గంగవరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఇద్దురూ తిరుపతి కోర్టులో విధులు

నిర్వహిస్తున్నారు.

గంగవరం: ఒక పక్క నిద్రమత్తు.. మరోపక్క అతి వేగం ఈ రెండింటి కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన గంగవరం మండలం, గంగవరం బైపాస్‌ రహదారిలోని వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సీఐ రాంభూపాల్‌ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి థర్డ్‌ ఏడీజే కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న యుగంధర్‌(47), హరీష్‌(35)తోపాటు మరో నలుగురు రజని, గురుమూర్తి, కిరణ్‌కుమార్‌, డ్రైవర్‌ జగదీష్‌ మొత్తం ఆరుగురు కలిసి స్కార్పియో కారులో తిరుపతి నుంచి బెంగుళూరులో ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లారు. మ్యాచ్‌ పూర్తయ్యాక బెంగళూరు నుంచి తిరుపతికి తిరుగు పయాణమ య్యారు. మార్గమధ్యంలోని గంగవరం బైపాస్‌ రహదారి వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద ముందు వెళ్తున్న లారీ స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ఒక్కసారిగా బ్రేక్‌ వేసింది. అదే సందర్భంలో కారు వెనుక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో కొట్టాల గ్రామం, చంద్రగిరికి చెందిన యుగంధర్‌, ఉపాధ్యాయనగర్‌, తిరుపతికి చెందిన హరీష్‌ ఇద్దురూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

అర్ధరాత్రి భారీ శబ్దం

అర్ధరాత్రి వేళ హైవేలో భారీ శబ్దం.. గాఢ నిద్రలో ఉన్న స్థానికులంతా ఆ శబ్దానికి ఉలిక్కి పడి లేచారు. ఒక్కసారిగా హైవే వైపు పరుగులు తీశారు.. జాతీయ రహదారిలో లారీని కారు ఢీకొట్టినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్‌ సీఐ రాంభూపాల్‌, పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వల్ప గాయాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబీకులకు అప్పగించారు. సమాచారం తెలుసుకుని తిరుపతి, పుంగునూరు తదితర ప్రాంతాల నుంచి జడ్జిలు, న్యాయవాదులు, ఇతర ఉద్యోగులు పలమనేరు ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

వరుస ప్రమాదాలతో హడల్‌

ఇదిలా ఉండగా ఈ మధ్య ఇదే జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కారులో తిరుమలకు వెళ్తూ జరిగిన ఘోర ప్రమాదంలో అందురూ మృత్యువాత పడ్డా రు. ఆ తరువాత మరో కారు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తు తం జరిగిన ప్రమాదంలో ఇద్దురు దుర్మర ణం పాలయ్యారు. ఈ విధంగా వరుస ప్రమాదాల కారణంగా పలువురు ప్రాణా లు కోల్పోవడంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. హైవేలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

గంగవరం బైపాస్‌లో

ఘోర ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement