పనిచేయని పాత ట్యాబ్‌లు
కుస్తీ పడుతున్న ఉపాధ్యాయులు
ఆంక్షలు
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సవాలక్ష ఆంక్షలు విధించారు. రాష్ట్ర విద్యాశాఖ అనాలోచిత నిర్ణయాలు, అధికారుల మొండి వైఖరి వెరసి ముల్యాంకన కేంద్రాల్లో టీచర్ల పడరానిపాట్లు పడ్డారు. ఒక వైపు భానుడి భగభగలు, మరోవైపు అధికారుల ఆంక్షల మధ్య టీచర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. మొదటి రోజు మూల్యాంకన ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకుగానీ ప్రారంభం కాలేదు. పాత ట్యాబ్‌లు ఇవ్వడంతో మార్కుల నమోదు తలనొప్పిగా
మారింది.
టెక్నాలజీ తిప్పలు
డిజిటల్ విధానంలో మార్కులు నమోదు చేయాల ని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. టీచర్లకు తుప్పుపట్టిన పాత ట్యాబ్‌లను అప్పగించింది. వీటిలో కొన్ని ఆన్ కాకపోవడం, బ్యాటరీ సమస్యలు, సాఫ్ట్‌వేర్ మొరాయించడంతో మార్కుల నమోదు కష్టతరంగా మారింది. చాలా సేపు ట్యాబ్‌లతో కుస్తీ పడుతు న్నా ఫలితం లేకపోవడంతో టీచర్లు అసహనం వ్యక్తం చేశారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పది మూల్యాంకన ప్రక్రియ మొదటి రోజే గందరగోళంగా మారింది. వివిధ జిల్లాల నుంచి 1,63,560 జవాబు పత్రా లు వచ్చాయి. వీటి మూల్యాంకన ప్రక్రియకు 72 బ్యాచ్‌లను కేటాయించారు. అలాగే సీఈలు 72, ఏఈలు 416, స్పెషల్ అసిస్టెంట్‌లు 210, మొత్తం 698 మందిని నియమించారు. వీరందరికీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులే లీప్ యాప్ రూపంలో నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వులను ఇష్టానుసారంగా జారీ చేయడంతో మొదటి రోజు మూల్యాంకనంలో గందరగోళం చోటుచేసుకుంది. అధునాతనంగా ప్రారంభించిన ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు తలనొప్పిగా మారింది.
వసతులెక్కడ
మూల్యాంకన కేంద్రంలో కనీస వసతులు లేవు. ఎండలు మండిపోతున్నా పలు తరగతి గదుల్లో ఫ్యాన్ లు పనిచేయకపోవడం, వెలుతురు సరిగా లేకపోవడం, తాగునీటి సౌకర్యం పెద్దగా లేకపోవడంతో టీచర్లు ఉక్కపోతతో అల్లాడిపోయారు. మూల్యాంకన కేంద్రం వద్ద విధుల్లో ఉండాల్సిన పోలీసులు లేకపోవడంతో బయట వ్యక్తులు యథేచ్ఛగా లోనికి ప్రవేశించారు.
సమ్మేటివ్ పరీక్షలపై తీవ్ర ప్రభావం
సోమవారం మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కావడంతో క్షేత్ర స్థాయిలో పాఠశాలల్లో ప్రారంభమైన సమ్మేటివ్ 2 పరీక్షలు గాడితప్పాయి. ఒక వైపు మూల్యాంకనం విధులు, మరోవైపు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు... ఈ రెండూ ఒకేసారి రావడంతో క్షేత్ర స్థాయిలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మా రింది. పదో తరగతి పేపర్లు దిద్దేందుకు సీనియర్ టీచర్‌లతో పాటు ప్రాథమిక పాఠశాలల టీచర్లకు విధులు కేటాయించారు. దీంతో జిల్లాలోని పాఠశాలల్లో సగానికి పైగా టీచర్లు స్పాట్ విధులకు వెళ్లా రు. ఫలితంగా, పాఠశాలల్లో ఉన్న కొద్ది మంది టీచ ర్లే అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఒకే గదిలో రెండు, మూడు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్న దృశ్యాలు పలు చోట్ల కనిపించాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణం.
మార్కుల నమోదుకు పాత ట్యాబ్‌లు
పది మూల్యాంకనంలో
వింత పోకడలు
బంధీలుగా అయ్యోర్లు
టీచర్ల పట్ల అధికారులు కనికరం లేకుండా వ్యవహ రిస్తున్నారు. ట్యాబ్‌లలో మార్కు ల నమోదు పూర్త య్యే వరకు ఎవ్వరూ ఇళ్లకు వెళ్లడానికి వీల్లేదు. సాంకేతిక లోపాలు విద్యాశాఖవైతే, ఇందుకు టీచర్లను రాత్రి వరకు కేంద్రాల్లోనే బంధీలుగా పెట్టడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. విధు లు నిర్వహించలేక అనేక మంది టీచర్లు తమ డ్యూటీలను రద్దు చేయించుకునేందుకు అధికారుల వద్ద పడిగాపులు కాశారు.


