ఇంటి పన్ను చెల్లించలేదని.. పింఛన్‌ కట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటి పన్ను చెల్లించలేదని.. పింఛన్‌ కట్‌

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

పాలసముద్రం : ఇంటి పన్ను చెల్లించలేదని వికలాంగుడికి పింఛను మొత్తా న్ని ఇవ్వకుండా ఆపేశారు. బాధితుడు మండలంలోని క్రిష్ణజమ్మాపురం పంచా యతీ ఆదిఆంధ్రవాడకు చెందిన గురు స్వామి కథనం మేరకు.. గురు స్వామి వికలాంగుడు. అతనికి వికలాంగుల పింఛను రూ.6 వేలు వస్తోంది. అతను ఉంటున్న ఇంటికి పన్ను చెల్లించలేదు. ఈ క్రమంలో పంచాయతీ అధికారులు అతనికి ఈ నెల పింఛను మొత్తం ఇవ్వలేదు. ఇంటి పన్ను చెల్లిస్తేనే పింఛను మొత్తం ఇస్తామని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. ఆ ఇల్లు ఇద్దరికి భాగం ఉందని, భాగపరిష్కారమై తనకు వస్తేనే ఇంటి పన్ను చెల్లిస్తానని గురుస్వామి చెప్పినా అధికారులు వినలేదు. ప్రతిరోజూ సచివాలయానికి వెళ్లడం.. తిరిగి ఇంటికి చేరుకోవడం షరా మూమూలుగా మారిందని బాధితుడు వాపోతున్నాడు. తనకు వచ్చే పింఛను మొత్తంతోనే జీవనం సాగిస్తున్నానని, ఈ నెల నగదు ఇవ్వకపోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై ఎంపీడీవో సతీష్‌ కుమార్‌ వివరణ ఇస్తూ పింఛను ఇవ్వకపోవడం సరికాదన్నారు. విచారించి ఇకమీదట అలా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గురుస్వామి కి వచ్చే నెల రెండు నెలల పింఛను రూ.12 వేలు అందజేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement