3 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు రూ.2.10 లక్షలు ఖర్చవుతోంది. దీనికి సబ్సిడీ రూ.78 వేలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇందుకు గాను వినియోగదారుల నుంచి రూ.21 వేలు కట్టించుకుంటున్నారు. 7 ఏళ్ల గడువుతో ప్రతినెలా రూ.2 వేల చొప్పున చెల్లించేలా వినియోగదారుల నుంచి అంగీకారం తీసుకుంటున్నారు. బ్యాంకు మేనేజర్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సీడీ మొత్తం రూ.78 వేలను ఈఎంఐలకు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆ సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకులకు కట్టాల్సిన అవసరం లేదని విద్యుత్ అధికారులు అంటున్నారు. ఇది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వీటిపై తరుచూ కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆదేశాలు ఇస్తున్నా తమకు వర్తించదని బ్యాంకర్లు దర్జాగా ఉన్నారు.


