కష్టపడిన వారికి తగిన గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

కష్టపడిన వారికి తగిన గుర్తింపు

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

కుప్పం : నాయకులు, కార్యకర్తలు నిజాయితీతో పనిచేసి వైఎస్సార్‌ సీపీని మరోసారి అధికారంలోకి తీసుకువద్దామని వైఎస్సార్‌ సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కర్త, ఎమ్మెల్సీ భరత్‌ తెలిపారు. ఆయన బుధవారం గుడుపల్లె, కుప్పం రూరల్‌, కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్సార్‌ సీపీ బూత్‌ కన్వీనర్లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడతూ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధిపొందిన వారు ఇప్పుడు పార్టీని వీడి మోసం చేశారని తెలిపారు. చాలా మంది వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిపై అభిమానంతో రెండేళ్లుగా ఎన్నో అవమానాలు పడుతూ, పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా అందరినీ గుర్తు పెట్టుకుంటామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో బూత్‌ కన్వీనర్లే పార్టీకి కీలకమన్నారు. నిజాయితీతో పనిచేసి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎంపికై న బూత్‌ కన్వీనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండలాల కన్వీనర్లు రామకృష్ణ, హఫీజ్‌, నియోజకవర్గ బూత్‌ కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, గుడుపల్లె మండలం బూత్‌ కన్వీనర్‌ సంపంగి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement