చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు–తచ్చూరు హైవేపై వాహనాలను బుధవారం నుంచి ట్రయిల్‌రన్‌లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్లు రోడ్డు పనులు పూర్తయ్యాయి. మొత్తం 116 కి.మీ కాగా అందులో పనులు పూర్తవ్వడంతో అధికారులు రాకపోకలకు అవకాశం కల్పించారు. త్వరలో టోల్‌గేట్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు పై 100 స్పీడ్‌తో 95 కిలోమీటర్ల దూరం 1.30 గంటల్లో చేరుకోవచ్చని అంచనా వేశారు. ఇందులో అనుపల్లె్, అరతల, నరసింహరాజపురం, పల్లెపట్లు, నగరి, ఊత్తుకోట, కుమారజపేట, ఎన్‌ఆర్‌పురం, వీరకావేరిరాజపురం, పొందవక్కం మొత్తం 7 ఇంటర్‌చేంజ్‌లు ఉంటాయని తెలిపారు.


