చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చి త్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. గాంధీరోడ్డులోని డివిజన్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు.
యువ శక్తితోనే
వికసిత భారత్ సాధ్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): యువ శక్తి భాగస్వామ్యంతోనే వికసిత భారత్–2047 లక్ష్యం సాధ్యమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా స్థాయి ‘వికసిత భార త్ యువ పార్లమెంట్–2026’ కార్యక్రమాన్ని మురకంబట్టులోని అపోలో యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించారు. ఎంపీ, యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ హెచ్.వినోద్‌భట్ జిల్లాలోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థు లు పా ల్గొని ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ బాధ్యతలు, జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర వంటి అంశాలపై చర్చించారు. ‘50 ఏళ్ల ఎమర్జెన్సీ – భారత ప్రజాస్వామ్యానికి పాఠా లు’ అనే థీమ్ పై నిర్వహించిన ప్రత్యేక యువ పార్లమెంట్ సమావేశం ఆకట్టుకుంది. అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.పోతరాజు మార్గదర్శకత్వంలో కార్యక్ర మం విజయవంతంగా సాగింది. కార్యక్రమంలో అపో లో యూనిట్ హెడ్ ఎస్.బాలరాజ్, అపోలో మోడల్ యునైటెడ్ నేషనన్స్ క్లబ్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డా.సుధ పైపూరు పాల్గొన్నారు.
సీఎంఓకు వైద్యశాఖ అవినీతి
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతిపై సీఎంఓకు ఫిర్యాదు వెళ్లినట్లు మంగళవారం ఓ వర్గానికి చెందిన అధికారులు వెల్లడించారు. ఆరోగ్యశాఖలో అవి నీతి కంపు శీర్షికతో సాక్షిలో ప్రచురితమై కథనంపై కొందరు అధికారులు స్పందించారన్నారు. ఈ మేరకు వాస్తవాలను సీఎంఓకు చేరవేసినట్లు వివరించారు. అలాగే జిల్లాలోని ముగ్గురు ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయాలను రాష్ట్ర స్థాయి అధికారులకు విశదీకరించినట్లు విశ్వసనీ సమాచారం.
నేడు మార్కెట్ గేటుకు టెండర్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో కూరగాయల మార్కెట్ గేటు వసూళ్లకు బుధవారం టెండర్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫిబ్రవరిలో టెండర్లు పిలిచారు. అయితే ఎవరూ రాకపోవడంతో వాయిదా పడింది. దీంతో రెండో మారు వేలం పాట చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించనున్నారు. మార్కెట్లతో పాటు జంతు వధశాల, ప్రైవేటు బస్సుల నుంచి రుసుము వసూలు చేసుకునే టెండర్లను సైతం చేపట్టనున్నారు. ఇప్పటికే మౌనికుమా ర్, వరలక్ష్మి అనే ఇద్దరు కాంట్రాక్టర్లు సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించారు. కాగా శశికళ అనే మహిళకు కార్పొరేషన్ అధికారులు ఉద్దేశపూర్వకంగా సాల్వెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని కలెక్టర్‌కు టీడీపీ నేత ఒకరు ఫిర్యాదు చేసి విషయం తెలిసిందే. ఈక్రమంలో కార్పొరేషన్ కు చెందిన ఇద్దరు అధికారులు తమకు ఫోన్ చేసి సాల్వెన్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం తమ తప్పిదమేనని.. ఇది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లద్దని బతిమిలాడారని సదరు మహిళ తెలిపారు. అయితే ఆ ఆడియోను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిసింది.


