సమస్యల ఏకరువు
కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యలను ఏకరువు పెట్టి..పరిష్కరించాలంటూ అభ్యర్థించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వివిధ సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో 113 అర్జీలు నమోదైనట్లు ఏవో వాసుదేవన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పింఛన్ ఇప్పించడయ్యా
‘నా కుమారుడు పార్థీవ్‌కి చిన్నతనం నుంచి శరీరం సహకరించడం లేదు. మంచానికే పరిమితమై ఉన్నా డు. పెద్దమనస్సుతో పింఛన్ ఇప్పించండయ్యా..’ అంటూ పెనుమూరు మండలం గంగుపల్లెకి చెందిన తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. పార్థీవ్ తండ్రి జ్యోతీశ్వర్‌నాయుడు మాట్లాడుతూ పింఛన్ కోసం క్షేత్ర స్థాయిలో అధికారులకు వినతులు ఇస్తున్నా న్యాయం జరగడం లేదన్నారు. తన కుమారిడికి సదరన్ సర్టిఫికెట్‌లో 90 శాతం వికలత్వం ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారన్నారు. ఉన్నతాధికారులు దయ చూపి తన కుమారుడికి పింఛన్ అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.
శ్మశానభూమిని ఆక్రమించారు
తమ గ్రామంలో శ్మశానభూమిని ఆక్రమించారని పలమనేరు మండలం, వడ్డూరు గ్రామ వాసులు తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామంలో తరతరాల నుంచి 3 సెంట్ల భూమిలో శ్మశానవాటిక ఉందన్నారు. తమ గ్రామంలోని కొంతమంది శ్మశానవాటిక భూమిని ఆక్రమించుకున్నారన్నారు. ప్రస్తుతం తమ గ్రామంలో 100 కుటుంబాలు.. 800 మంది జనాభా నివసిస్తున్నట్లు తెలిపారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
కోళ్ల షెడ్డు నిర్మాణ పనులు ఆపించాలని కోరుతున్న కుక్కలపల్లి గ్రామస్తులు
ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు
తమ గ్రామంలో ఆలయ నిర్మాణాన్ని చేపడుతుంటే అశోక్‌నాయుడు, అర్జున్‌నాయుడు అడ్డుకుంటున్నారని గంగాధరనెల్లూరు మండలం పాత వెంకటాపురానికి చెందిన జానకీరామన్, గ్రామస్తులు వాపోయారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ పాత వెంకటాపురంలో 1978లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఇచ్చిన సర్వే నం.2/2లో గ్రామదేవతను స్థాపించి అప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఆ సర్వే నంబర్‌లో ఉన్న గుట్ట పోరంబోకు భూమిలో ఆలయం నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకుని భయాందోళన సృష్టిస్తున్నారన్నారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు.
సమస్యల ఏకరువు


