25న రథ సప్తమి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీమణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 25వ తేదీన రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తామన్నారు.
సచివాలయాల్లో మెరుగైన సేవలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో ప్రభుత్వం ముద్రించిన స్వర్ణ గ్రామ–వార్డు శాఖ నూతన క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. డీఎల్‌డీవో రవికుమార్ పాల్గొన్నారు.
ఈ నెలాఖరున సీఎం పర్యటన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెలాఖరున సీఎం చంద్రబాబునాయుడు పర్యటిస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో సీఎం పర్యటనపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ కుప్పంలో సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కుప్పంలో సీఎం చేతుల మీదుగా సామాజిక పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 500 మంది స్వయం సహాయక సంఘాల మహిళా ప్రతినిధులకు రుణాలు అందజేస్తారన్నారు.
25న రథ సప్తమి


