ఫిట్‌నెస్‌తోనే ఆరోగ్యమెరుగు!
నగరాల్లో పెరుగుతున్న జిమ్ కల్చర్
రోజూ శిక్షకుల సమక్షంలో సాధన
కార్వేటినగరం: మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణాలుగా గుండె సంబంధిత, చక్కెర వ్యాధులు ఎక్కువవుతునాన్నయి. జిల్లాలో యువత ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. 18 ఏళ్లకే గుండె పోటు మరణాలు నమోదవుతున్నాయి. వాటికి చెక్ పెట్టడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు యువత ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నారు.
ఎవరెవరు
జిమ్‌లో వయోభేదం లేకుండా సాధన చేస్తున్నప్పటికీ అధిక సంఖ్యలో 20 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వారు సాధనకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారిలో ఎక్కువ శాతం యువతే కనిపిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శారీరకంగా దృఢంగా ఉండాలని వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటర్మీడియెట్ నుంచి డిగ్రీ, పీజీ, సాఫ్ట్‌వేర్, ఉద్యోగం ఇలా.. యువత చేసే పనేదైనా నిత్యం జిమ్‌లో కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కేంద్రంలోనే కాకుండా చిన్న చిన్న నగరాల్లో కూడా జిమ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఆయా సెంటర్లలో ఏర్పాటు చేసే పరికరాలకు అనుగుణంగా చిన్న నగరాల్లో అయితే నెలకు రూ.750 నుంచి రూ.1000 వరకు, పెద్ద పట్టణాల్లో నెలకు రూ.1,500, 3 నెలలకు రూ.4వేలు, 6 నెలలకు రూ.7 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు జిమ్ కేంద్రాల యాజమాన్యం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు.
వ్యాయామం చేస్తున్న ఉపాధ్యాయుడు వేమయ్య , యువకుడు ప్రకాష్
స్వేదం చిందిస్తూ.. ఆరోగ్యంగా ఉంటూ
రోజూ ఉదయం 8కి జిమ్ కేంద్రాలు తెరుస్తున్నారు. 9 గంటల దాకా యువత అక్కడ చెమటోడుస్తున్నారు. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కేంద్రాలు ఉంటాయి. కొందరు రెండు పూటలా వ్యాయామం చేస్తుండగా, మరి కొందరు వెసులుబాటును బట్టి ఓ పూట కేంద్రాలకు వస్తున్నారు. జిమ్ నిర్వాహకులు అక్కడున్న పరికరాలను బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నారు. వ్యాయామంతో పాటు తీసుకోవాల్సిన ఆహారంపై కూడా చైతన్యం కలిగిస్తున్నారు.
వ్యాయామ సాధనే వ్యాధుల నియంత్రణ మార్గం
ఫిట్‌నెస్‌తోనే ఆరోగ్యమెరుగు!


