జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
బంగారుపాళెం: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం రాజేంద్ర తెలిపారు. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి బాలికల ఖోఖో పోటీలు నిర్వహించారన్నారు. జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన పాఠశాలకు చెందిన దీప్తి, ఉమేరా, జయశ్రీ, కావ్య కీలక పాత్ర పోషించి జిల్లా జట్టు గెలుపునకు కృషి చేసినట్లు తెలిపారు. పోటీల్లో ప్రతిభచాటి జాతీయ ఖోఖో పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు బాలికలు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా బాలికలను, క్రీడాకారులకు తర్ఫీదునిచ్చిన ఫిజికల్ డైరెక్టర్ మధుబాబును ఉపాధ్యాయులు అభినందించారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం జనార్దన్‌రెడ్డి, పీడీలు గిరిజ, సరస్వతి పాల్గొన్నారు.
ఖోఖో పోటీలకు ఎంపిక
వి.కోట : జూనియర్ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు మండలంలోని పాముగానిపల్లీ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని జి.లక్ష్మి ఎంపికై నట్లు హెచ్‌ఎం భాస్కర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లా పొంగూరులోని జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో లక్ష్మి ఉత్తమ ప్రతిభ కనబరిచి జూనియర్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న్నట్లు వివరించారు. ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె రాష్ట్ర ఖోఖో జట్టు తరఫున పాల్గొంటుదన్నారు. పాఠశాల యాజమాన్యం శిక్షణ ఇచ్చిన పీడీ హరిప్రసాద్‌ను, విద్యార్థిని అభినందించింది.


