బెల్టుషాప్‌పై దాడి
శ్రీరంగరాజుపురం: మండలంలోని కొత్తపల్లిమిట్ట ప్రాంతంలో ఉన్న బెల్టుషాపుపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో 42 మద్యం బాటిళ్లు పట్టుపడ్డాయి. బెల్టుషాపు నిర్వహిస్తున్న భారతి అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
విద్యుద్దీపాల కోసం రూ.8 లక్షలు
గుడిపాల: చిత్తూరు–వేలూరు రహదారిలోని మద్రాస్ క్రాస్ రోడ్డు నుంచి తమిళనాడు సరిహద్దు గొల్లమడుగు వరకు రోడ్డు పక్కన విద్యుత్ దీపాలు వేయడానికి కలెక్టర్ రూ.8 లక్షలు మంజూరు చేసినట్లు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్‌బాబు తెలిపారు. గురువారం ఆ రహదారిని ఆయన పంచాయతీరాజ్ ఈఈతో చంద్రశేఖర్‌తో కలిసి పరిశీలించారు. జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.8 లక్షలు మంజూరు చేశారన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 50 వీధిలైట్లు అవసరమవుతాయన్నారు. పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్‌నాయుడు, ఎంపీడీఓ శిరీషా తదితరులు పాల్గొన్నారు.


