ఆర్థిక సంఘం నిధులు విడుదల
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాకు రూ.28.52 కోట్లు రాగా 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులను కేటాయించారు. జిల్లాలో 696 గ్రామ పంచాయతీలుండగా వాటిలో పలు కారణాలతో 13 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 683 పంచాయతీలకు నిధులను జమచేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మొదట ఆన్‌టైడ్ కింద రూ.11.4 కోట్లు, టైడ్ నిధి కింద రూ.17.11 కోట్లు కలిపి మొత్తం రూ.28.52 కోట్లను విడు దల చేశారు. వీటిని పంచాయతీల్లో విద్యుత్ చార్జీలు, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, శ్మశానవాటికల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించింది.
ఆ లెక్చరర్‌ను సస్పెండ్ చేయండి
కార్వేటినగరం: డైట్ కళాఽశాలలో పనిచేస్తున్న ఆ లెక్చరర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. డైట్‌లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సురేష్ కొంతమంది లెక్చరర్లతో గ్రూపులు కట్టి లైంగికంగా వేధిస్తున్నారని, దసరా సెలవులకు ముందు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా మెసేజీలు పెట్టి ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నట్టు ప్రిన్సిపల్‌కు లిఖిత పూర్వకంగా ఫి ర్యాదు చేశారు. పలు మార్లు తీరు మార్చుకోవా లని ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో ప్రిన్సిపల్ వరలక్ష్మి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఆ మేరకు సురేష్ ను డైట్ కళాశాల నుంచి వెంటనే రిలీవ్ చేయా లని ఆదేశించారు. రిలీవ్ చేసి సస్పెండ్ చేయా లని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డొంక కదులుతోంది!
– అవినీతి కేసులో సర్వేయర్, వీఆర్‌ఓ
పుంగనూరు: స్థానిక గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములు రూ.20 వేలు లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో తాజాగా మండల సర్వేయర్‌తో పాటు ఆ గ్రామ వీఆర్‌ఓపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. రెండవ రోజు కూడా ఏసీబీ అధికారులు పుంగనూరులో మకాం వేశారు. మండల సర్వేయర్, వీఆర్‌ఓను విచారణకు రావాలని ఆదేశించగా.. వారు రాకపోవడంతో ఇద్దరిపైనా కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. కాగా తహసీల్దార్, సర్వేయర్ ఇద్దరూ సెలవులో వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు
చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలను సరికొత్త సంస్కరణలతో నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని ఇంటర్ బోర్డు ఈఆర్‌టీడబ్ల్యూ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ చాణుక్యుడు తెలిపారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలను కొత్త సంస్కరణలతో నిర్వహించనుందన్నారు. గురువారం అధికారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో స్థానిక విజయం ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రామాణిక విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇన్విజలేటర్లు, పర్యవేక్షక సిబ్బంది, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. డీఐఈఓ రఘుపతి మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, పారదర్శకంగా పరీక్షలు రాసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పకడ్బందీగా
వంద రోజుల ప్రణాళిక
ఐరాల: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించాలని ఆర్‌జేడీ శ్యామూల్ ఆదేశించారు. గురువారం మండలంలోని ఎం.పైపల్లె జెడ్పీ హైస్కూల్‌ను ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థుల అభ్యస సామర్థ్యాలపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. వంద రోజల ప్రణాళికతో పాటు అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పబ్లిక్ పరీక్షలకు అనుగుణంగా రూపొందించిన ప్రశ్నపత్రాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ప్రతి రోజూ ఓ పాఠ్యాంశంపై పరీక్ష నిర్వహించాలని, పరీక్ష అనంతరం జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి విద్యార్థుల సామర్థ్యాలు గుర్తించాలని ఆదేశించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం వైస్.గేటులోని ప్రాథమిక పాఠశాలకు కేంద్ర విద్యాశాఖ స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) రావడంతో పాఠశాలను ఆయన సందర్శించి పరిసరాలను పరిశీలించారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. ఎంఈఓ–2 భానుప్రసాద్, ఏసీఎంఓ మధుసూదన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


