గంగమ్మా..దీవించమ్మా | - | Sakshi
Sakshi News home page

గంగమ్మా..దీవించమ్మా

Dec 8 2025 7:52 AM | Updated on Dec 8 2025 7:52 AM

గంగమ్

గంగమ్మా..దీవించమ్మా

● అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ ● తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత ● సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో కోటి సంతకాలకు అనూహ్య స్పందన ● ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తిరుగుబాటు ● తిరుపతి జిల్లాలో 4.54 లక్షలు.. చిత్తూరు జిల్లాలో 3.81 లక్షలు ● 13 వరకు కొనసాగనున్న కోటి సంతకాల సేకరణ

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు.

ఉద్యమం.. మహోద్యమం!

సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

పుంగనూరు మున్సిపాలిటీలో కోటి సంతకాల సేకరణ ప్రతులను అందుకుంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఫైల్‌)

చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా 92 వేల సంతకాలు సేకరించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌న్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరో 8వేల సంతకాలు కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో నియోజక వర్గంలో లక్ష సంతకాల సేకరణ పూర్తి కానుంది.

5 కేంద్రాల్లో టెట్‌

– 10 నుంచి పరీక్షలు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఐదు కేంద్రాల్లో టెట్‌ నిర్వహిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 5 సెంటర్‌లలో ఈనెల 10వ తేదీ నుంచి 21 వరకు టెట్‌ నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని మదర్‌థెరిస్సా (పలమనేరు), ఎస్వీ సెట్‌ (ఆర్వీఎస్‌ నగర్‌), వేము ఇంజినీరింగ్‌ కళాశాల (పి.కొత్తకోట, పూతలపట్టు మండలం), సీతమ్స్‌ (చిత్తూరు), కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాల (కుప్పం)లో టెట్‌ నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు ఒక గంట ముందుగా చేరుకోవాలన్నారు. ఒరిజనల్‌ ఐడీ తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. ఏవైనా సందేహాలుంటే 7386408270, 9885506094 నంబర్‌లలో సంప్రదించాలన్నారు.

నేడు కలెక్టరేట్‌లో

ప్రజాసమస్యల పరిష్కార వేదిక

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తేదీన కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు.

నేడు పోలీసు గ్రీవెన్స్‌

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్‌ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.

కాణిపాకం.. భక్తజన సందడి

కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచి పోటె త్తారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వాములు స్వామి దర్శనం కోసం భారీగా వచ్చారు. వీరి రాకతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. ఆలయం ఆవరణం భక్త జనంతో కిక్కిరిసింది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనంతో పాటు వీఐపీ గేటు గుండా భక్తులు కిటకిటలాడారు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేపట్టారు.

సంతకం..

సమర శంఖారావం

సిరా చుక్కలు సంతకాల రూపం ధరిస్తున్నాయి.. అక్షర ఆయుధాలుగా మారుతున్నాయి. ఆ సంతకాలే సమర శంఖారావం పూరిస్తున్నాయి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నాయి. సర్కారుపై దండెత్తుతున్నాయి.. వైద్య విద్యను బాబు ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తున్నాయి. చిన్న ఉద్యమంగా మొదలై మహోద్యమంగా అవతరిస్తున్నాయి. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ చేపట్టిన కోటి సంతకాల యాగంలో పాలుపంచుకోవడానికి ఊరూవాడా సిద్ధమవుతున్నాయి. తమ పిల్లలపై ప్రైవేటు పెత్తనం వద్దంటూ సామాన్య, మధ్యతరగతి జనం స్వచ్ఛందంగా సంతకం చేసి, తమ నిరసనను వెలిబుచ్చుతోంది.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం.. మహాద్యమంలా సాగుతోంది. పార్టీలకతీతంగా విద్యార్థినీ విద్యార్థు లు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు కోటి సంతకాల సేకరణలో భాగస్వాములవుతుండడంతో తిరుపతి, చిత్తూరు, జిల్లాల్లో కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో 5 మెడికల్‌ కళాశాలలు 2023–2024 మధ్య కాలంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఆ ఐదు కళాశాలల ద్వారానే అదనంగా 750 ఎంబీబీఎస్‌ సీట్లు విద్యార్థులకు వచ్చేలా చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తిగా ఉన్న మెడికల్‌ కళాశాలల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. వాటిని పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కారు పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో మెడికల్‌ కళాశాలలన్నింటినీ కార్పొరేట్‌ వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. మెడికల్‌ కళాశాలలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యపై పెట్టుకున్న ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగుతోంది.

పూతలపట్టు: యాదమరిలో కోటి సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ (ఫైల్‌)

నగరి: ముడిపల్లెలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా (ఫైల్‌)

చిత్తూరు : సంతకాల సేకరణలో సమన్వయకర్త విజయానందరెడ్డి, పలమనేరులో సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ , కుప్పం: కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ భరత్‌ , కార్వేటినగరం: సంతకాల సేకరణలో సమన్వయకర్త కృపాలక్ష్మి (ఫైల్‌ ఫొటోలు)

ఎవరి స్వలాభం కోసం..

ప్రభుత్వ బడ్జెట్‌తో నిర్మించిన మెడికల్‌ కళాశాలను ఎవరి స్వలాభం కోసం ప్రైవేటీకరణ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను నిర్మించాల్సింది పోయి ఉన్న వాటిని ప్రైవేట్‌ పరం చేయడం దారుణం. ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ పేద విద్యార్థులకు తీవ్ర అన్యా యం చేసేందుకే చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేసి 17 మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేసింది. ఇంక సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తిస్థాయిలో మెడికల్‌ కళాశాలల పనులు పూర్తి అవుతాయి. అది చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌ పరం చేయాలని అనుకోవడం బాధాకరం. రాష్ట్ర బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న టీడీపీ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను పూర్తి చేయలేరా? అని ప్రశ్నిస్తున్నాం. – పురుషోత్తం, చిత్తూరు నగరం

ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి

ప్రభుత్వ మెడికల్‌ కళాశాల లు ప్రభుత్వం పరిధిలోనే ఉండాలి. ప్రైవేట్‌ పరం చేయకూడదు. వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగా ల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలు గుతుంది. ఇప్పటికే వైద్యం, విద్య రెండూ ఖరీదయ్యాయి. మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం తన నిర్ణ యం వెనక్కి తీసుకోవాలి. లేకపోతే వైద్య విద్య పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారుతుంది. – దినేష్‌, చిత్తూరు నగరం

గంగమ్మా..దీవించమ్మా 
1
1/9

గంగమ్మా..దీవించమ్మా

గంగమ్మా..దీవించమ్మా 
2
2/9

గంగమ్మా..దీవించమ్మా

గంగమ్మా..దీవించమ్మా 
3
3/9

గంగమ్మా..దీవించమ్మా

గంగమ్మా..దీవించమ్మా 
4
4/9

గంగమ్మా..దీవించమ్మా

గంగమ్మా..దీవించమ్మా 
5
5/9

గంగమ్మా..దీవించమ్మా

గంగమ్మా..దీవించమ్మా 
6
6/9

గంగమ్మా..దీవించమ్మా

గంగమ్మా..దీవించమ్మా 
7
7/9

గంగమ్మా..దీవించమ్మా

గంగమ్మా..దీవించమ్మా 
8
8/9

గంగమ్మా..దీవించమ్మా

గంగమ్మా..దీవించమ్మా 
9
9/9

గంగమ్మా..దీవించమ్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement