సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం | - | Sakshi
Sakshi News home page

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం

Dec 8 2025 7:52 AM | Updated on Dec 8 2025 7:52 AM

సంతకం

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం

నగరి : కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. మున్సిపల్‌ పరిధి 11వ వార్డులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువత విభాగం కార్యదర్శి గుడుబా ఆధ్వర్యంలోనూ, సత్రవాడలో మున్సిపల్‌ పార్టీ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలోనూ ఆదివారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు తెలు పగా జనం ముందుకు వచ్చి సంతకాలు చేపట్టడంతో ఒక ఉద్యమంలా కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. వైద్య కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యా ర్థుల వైద్య విద్యకు గండికొట్టి జేబులు నింపుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కళైసెల్వన్‌, కేశవన్‌, రవి, గుణ, అయ్యప్పన్‌, మోహన్‌రాజ్‌, భూపాలన్‌ పాల్గొన్నారు.

ఉచిత వైద్య విద్య కోసం పోరు

వడమాలపేట (పుత్తూరు) : ఉచిత వైద్య విద్య పేదలకు అందే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యూత్‌ నాయకుడు గాంధీ స్పష్టం చేశారు. ఆది వారం వడమాలపేట మండలం కాయం గ్రామంలో గాంధీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ చేపట్టారు. వైద్య కళాశాలలను ఏర్పాటు చేయలేని చంద్రబాబుకు ఉన్నవాటిని ప్రైవేటీకరించే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. నేడు గ్రామాల్లో ప్రైవేటీకరణపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నా రు. అలాగే వడమాలపేట మండలం బట్టికండ్రిగ, ఎస్వీపురం, వడమాలపేటలో పార్టీ కన్వీనర్‌ సుబ్రమణ్యంరెడ్డి, సురేష్‌రాజు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. వేణునాధం, చంద్ర, నిరంజన్‌రెడ్డి, నాని, తుకారాం, జయంతు, గిరిబాబు, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

వెల్లువెత్తిన నిరసన సంతకం

పూతలపట్టు(యాదమరి) : కోటి సంతకాల సేకరణతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో నిస్తేజం మొదలయ్యిందని పూతలపట్టు ని యోజకవర్గ వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు తలపులపల్లి బాబురెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తలపులపల్లి పంచాయతీలో బాబు రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్ర మం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు స్వ చ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, వైద్య కళాశాలలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న స్వార్థ పూరిత నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకువెళతా మని చెప్పారు. స్థానిక సర్పంచ్‌ సుబ్రమణ్యం, ఉప సర్పంచ్‌ రెడ్డప్ప రెడ్డి, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి.హరి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఉద్యమంలా సంతకాల సేకరణ

బైరెడ్డిపల్లె : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో విద్య, వైద్యంతో పాటు మహిళా, రైతు సంక్షేమం సక్రమంగా అందిందని రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి అన్నారు. ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమం ఆదివారం మండల పరిదిలోని పలు గ్రామాల్లో ఉద్యమంలా సాగింది. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

బైరెడ్డిపల్లెలో సంతకాలు సేకరిస్తున్న రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి క్రిష్ణమూర్తి , 11వ వార్డులో సంతకాలు చేస్తున్న ప్రజలు , సత్రవాడలో.. , పూతలపట్టులో కోటిసంతకాల కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం1
1/4

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం2
2/4

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం3
3/4

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం4
4/4

సంతకం.. బంగారు భవిష్యత్తుకు సంకేతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement