వైభవంగా భక్త కనకదాసు ఉత్సవాలు
వి.కోట : మండల కేంద్రంలో ఆదివారం భక్త కనకదాసు జయంతి ఉత్సవాలను కురబలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌శాఖ మంత్రి సవిత, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, కర్ణాటక రాష్ట్రం కోలార్ ఎమ్మెల్యే వర్తూర్ ప్రకాష్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన మహిళలు పాల కలశాలతో కనకదాసు విగ్రహం వరకు ఊరేగింపు చేపట్టి భక్త కనకదాసు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కురబలు తమ సంప్రదాయ పద్ధతిలో భక్తుల తలపై టెంకాయలు కొట్టి వారి భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర మంత్రి సవిత మాట్లాడుతూ.. కురబలు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కురబ సంఘం అద్యక్షుడు కృష్ణప్ప, ప్రదాన కార్యదర్శి అమర్‌గౌడ్, స్థానిక నేతలు రామచంద్రా నాయుడు, రంగనాథ్, ఈశ్వర్ గౌడ్ , దీరజ్ కురబ కుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


