సార్.. ఎందుకింత మంది పోలీసులు?
– పోలీసుల బందోబస్తు మధ్య మండల
సమావేశం
బంగారుపాళెం : స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద కు ఉదయం 10 గంటలకు పలమనేరు డివిజన్ పరిధి లోని పది మంది పోలీసులు వచ్చి ఆఫీస్ వద్ద కూర్చున్నారు. ఆదివారం స్థానిక వెలుగు కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు ఒక్కొక్కరుగా వస్తున్నారు. పోలీసులను చూస్తూ సభ్యులు ఇంత మంది పోలీసులు ఎందుకు వచ్చారు. ఏమై ఉంటుంది. ఏమి జరుగుతుందో..ఏమోనని మనసులో అనుకుంటూ సమావేశ మందిరం వైపు సాగా రు. 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది. యథా విధిగా సమావేశంలో అధికారులు అజెండాలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి వివరించారు. సభ్యు లు వారి సందేహాలు, సమస్యలపై ప్రస్తావించారు. సమావేశం మధ్యలో నుంచి ఓ సభ్యురాలు బయటకు వచ్చి తన సందేహాన్ని తీర్చుకునేందుకు వచ్చింది. అక్కడే ఉన్న ఓ పోలీసన్నను ఇలా అడిగింది. సార్, మండల సర్వసభ్య సమావేశానికి ఇంతమంది పోలీసులను బయట నుంచి ఎందుకు రప్చించారు. ఏమి జరుగుతోంది..? అని అడిగింది. నేను గతంలోనూ ప్రజాప్రతినిధి హోదాలో పలుసార్లు మండల సర్వస భ్య సమావేశాలకు హాజరయ్యాను. ఇలా భారీ స్థాయి లో మండల సమావేశానికి బందోబస్తు లేదు. గత నాలుగైదు సమావేశాలప్పటి నుంచి ఇలా పోలీసులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఎందుకు...? అసెంబ్లీ సమావేశాల తరహాలో పోలీసులను మండల సమావేశానికి బందోబస్తుగా రావడం ఆశ్చర్యంగా ఉంది సార్ అని అన్నారు. ఆ పోలీసన్న నోటి నుంచి చిరునవ్వు తప్ప సమాధానం లేదు. స్థానిక సీఐ పర్యవేక్షణలో ఓ ఎస్‌ఐ, 10 మంది పోలీసులు మండల సమావేశానికి బందోబస్తుగా రావడంపై చర్చగా మారింది. మండలంలో మెజారిటీ సర్పంచులు, ఎంపీటీసీలు వైఎస్సా ర్‌సీపీ పార్టీకి చెందిన వారే. టీడీపీ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన 18 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కడ మండల సమావేశంలో నిలదీస్తారనే అనుమానంతో బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.


