ఖోఖో బాలబాలికల జిల్లా జట్లు ఎంపిక
బంగారుపాళెం: మండలంలోని మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్కూల్ గేమ్స్ అండర్–17 ఖో ఖో బాలబాలికల జిల్లా జట్లు ఎంపిక పోటీలు నిర్వహించినట్లు హెచ్‌ఎం రాజ్యలక్ష్మి తెలిపారు. బాలబాలికల జట్ల ఎంపిక పోటీలను డీఎస్‌డీఓ బాలాజీ, ఖోఖో సంఘం జిల్లా కా ర్యదర్శి శరత్‌బాబు, స్కూల్‌గేమ్స్ కార్యదర్శి శారద పర్యవేక్షణలో నిర్వహించినట్లు చెప్పారు. జిల్లాలోని ఏడు డివిజన్ల నుంచి 120 మంది బాలికలు, 120 మంది బాలురు ఎంపిక పోటీల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న బాలబాలికల జిల్లా జట్లు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు కాకినాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. కార్య క్రమంలో స్థానిక సర్పంచ్ మురళి, ఎస్‌ఎంసీ చైర్మన్ రమేష్, ఎంఈఓలు నాగేశ్వర్‌రావు, రమేష్‌బాబు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు ధరణిప్రసాద్ తదితరులతు పాల్గొన్నారు.


