హోరాహోరీగా సౌత్ జోన్ లెవల్ వాలీబాల్ పోటీలు
రొంపిచెర్ల: స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో సౌత్ జోన్ లెవల్ వాలీబాల్ పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. తొలుత రొంపిచెర్ల– మంగళపేట జట్లు తల పడ్డాయి. ఈ పోటీలో రొంపిచెర్ల జట్టు విజయం సాధించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 50 జట్లు పేర్లును నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డే అండ్ నైట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఆదివారం సాయంత్రంతో ముగుస్తాయని తెలిపారు. గెలుపొందిన జట్లకు నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. వారికి నిర్వాహకులు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సీఐ జయరాం నాయక్, ఎస్‌ఐ సుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి, నిర్వాహకులు షబ్బీర్, రౌనఖ్, ఆజమ్ తదితరులు పాల్గొన్నారు.
కష్టమైనా.. దున్నేశాడు
యాదమరి: ఆరుగాలం కష్టించి సాగు చేసిన వరి పంట వర్షార్పణం అయింది. చివరికి నీట మునిగిన పంటను కోయలేక.. కష్టమైనా ట్రాక్టర్‌తో దున్నేశాడు ఓ రైతు. బాధిత రైతు కథనం మేరకు.. యాద మరి మండలం పెరుమాళ్లపల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డి తనకున్న 2.30 ఎకరాల పొలంలో మీనా అనే సన్నరకం వరి సాగు చేశాడు. సుమారు రూ.లక్ష వర కు పెట్టుబడి పెట్టాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంట మొత్తం నేలకొరిగి నీటి పాలైంది. విధిలేని పరిస్థితిలో పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. గతంలో పంటపై బీమా సౌకర్యం ఉండేదని తద్వారా విపత్తుల సమయంలో లబ్ధి చేకూరే అవకాశం ఉండేదని రైతు రాజశేఖర్ రెడ్డి అన్నారు. కానీ తాను వరి పంట సాగు చేసే సమయంలోనే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు బీమా చేయమని రూ.900 చెల్లించమని చెప్పారు. అయితే సర్వర్ సమస్య వల్ల కట్టిన డబ్బులను తిరిగి ఇచ్చే శారని అన్నారు. దీంతో తాను సుమారు రూ.లక్ష వరకు నష్టపోవాల్సి వచ్చిందని వాపోయాడు.
చలో ఢిల్లీని విజయవంతం చేయండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈనెల 17వ తేదీన చలోఢిల్లీకు పిలుపునిచ్చామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందక్రృష్ణ మాదిగ పేర్కొన్నారు. చిత్తూరులోని అంబేడ్కర్ భవనంలో శనివారం మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడిపై ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. సాక్ష్యం లేకపోయినా పోలీసులు ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయకూడదని ప్రశ్నించారు. మానవహక్కుల సంఘాలు కూడా స్పందించలేదన్నారు. గవాయి దళితుడు అయినందునే ఈ దాడిపై కేసు నమోదు కాలేదని, చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కూడా వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయని తాము భావిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17వ తేదీన చలో ఢిల్లీకి పిలుపునిచ్చామన్నారు.
వర్చువల్ విధానంలో
7 పరిశ్రమలకు శంకుస్థాపన
కుప్పం : నియోజకవర్గంలో ఏడు ప్రధాన పరిశ్రమల స్థాపన కోసం సీఎం చంద్రబాబు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. శనివారం విజయవాడ నుంచి చేసిన ఈ కార్యక్రమాన్ని కుప్పం, గుడుపల్లె, రామకుప్పం, శాంతిపురం మండలాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు సదుపాయాలు కల్పించారు. గుడుపల్లె మండలం, పొగురుపల్లివద్ద 3, కుప్పం, శాంతిపురం మండలాల్లో 2 వంతున పరిశ్రమలు స్థాపిస్తున్నట్లు తెలిపారురు. హిందాల్కో, శ్రీజడెయిరీ, ఎస్ ఇంటర్నేషనల్, ఎస్‌వీఎఫ్, మదర్‌డెయిరీ, హిరాయ్, ఆలీప్ మహిళా పార్కులు స్థాపించినట్లు తెలిపారు. తంబిగానిపల్లి వద్ద ఆదిత్యా బిర్లా నిర్మిస్తున్న మొబైల్ స్పేర్ పార్ట్స్ పరిశ్రమకు కలెక్టర్ సుమిత్‌కుమార్ పాల్గొన్నారు.
హోరాహోరీగా సౌత్ జోన్ లెవల్ వాలీబాల్ పోటీలు


