కుంకీల లక్ష్యం ఇదీ!
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఏనుగు ముప్పు.. ఎవరు దిక్కు
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మదపుటేనుగులు ముప్పేట దాడి చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలను సర్వనాశనం చేస్తున్నాయి.
శిక్షణ, ట్రయల్స్‌కే పరిమితం
ఆదివారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2025
కుంకీల ఆపరేషన్ సర్కస్ ఫీట్లకే పరిమితమైంది. ఇంకా శిక్షణ, ట్రయల్ రన్‌తోనే సాగుతోంది. ఒకపక్క ఏనుగులు భీకర దాడులు చేస్తున్నా కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు సర్వనాశనమవుతున్నా.. మనుషులను తొక్కి ప్రాణాలు తీస్తున్నా చూస్తూ మిన్నకుండిపోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన కుంకీల క్యాప్చరింగ్ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల దాడులు.. కుంకీల క్యాప్చరింగ్‌పై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్..!
ముసలిమొడుగు ఎలిఫెంట్
క్యాంపులోని కుంకీలు
కుంకీలు..
సర్కస్ ీఫీట్లు!
జిల్లాలో ఏనుగుల పరిస్థితి ఇదీ
పలమనేరు, కుప్పం, పూతలపట్టు, పుంగనూరు పరిధిల్లోని కౌండిన్య అభయారణ్యంలో మొత్తం 105దాకా ఏనుగులుండగా ఇందులో కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీలోనే 56 దాకా ఉన్నాయి. ఇవిగాక పక్క రాష్ట్రాల నుంచి మైగ్రేటెట్ ఏనుగులు ఇక్కడికి వస్తుంటాయి.
పలమనేరు: టేకుమంద ఫారెస్ట్‌లో మూడు నెలల క్రితం కుంకీ ఏనుగుల ట్రయల్‌రన్ చేపట్టారు. అది విజయవంతమైందని అధికారులు డప్పుకొట్టారు. మదపుటేనుగుల క్యాప్చరింగ్ త్వరలో చేపడతామని చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న కుంకీలకు మనిషి చెప్పినట్టు వినేలే కమాండింగ్స్ ఇచ్చి వాటి ద్వారా రకరకాల సర్కస్ ఫీట్లను మాత్రం చేయిస్తున్నారు. వీటిని చూసేందుకు ఎక్కువగా ప్రజలు ఎలిఫెంట్ క్యాంపునకు వెళుతున్నారు.
తొక్కి చంపేస్తున్నాయి!
2012 నుంచి ఇటీవల సోమలలో మృతి చెందిన కృష్ణంరాజు దాకా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పాయారు. ఏనుగుల దాడుల్లో 25 మందికిపైగా గాయపడ్డారు. ఏనుగుల బారినపడి 64 పశువులు మృతి చెందాయి. ఈ దాడులు చేసింది ఎక్కువగా మదపుటేనుగులే. 9 వేల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఏనుగులు అడవిని దాటి బయటకొచ్చి ఇప్పటిదాకా 24 దాకా మృత్యువాత పడ్డాయి.
ఆ రాష్ట్రాల్లో క్యాప్చరింగ్ ఎలాగంటే..!
ప్రజల ప్రాణాలు తీస్తున్న వాటిలో 90శాతం మదపుటేనుగులే. ఇక్కడి ఎలిఫెంట్ క్యాంపులోని దేవా, రంజన్ సైతం కుంకీలుగా మారాలి. అప్పుడు కుంకీలు నాలుగు దిశల్లో వెళ్లి గుంపులోని మదపుటేనుగులను అదుపుచేయాలి. ఆ సమయంలో మావటీలు మత్తు సూదిచ్చి దాన్ని బంధించి క్యాంపునకు తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన మదపుటేనుగులను క్యాంపులోని క్రాల్స్‌లో బంధించి మూడు నుంచి ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఆపై అవి కుంకీలుగా మారుతాయి. ఈ ప్రక్రియ పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడులో సాగుతోంది. అదే విధంగా ఇక్కడి మదపుటేనుగులను కట్టడి చేయాలంటే ఇంకా మూడేళ్లదాకా పట్టే అవకాశముంది.
భారంగా కుంకీల సంరక్షణ
ఏనుగుల సమస్యలు అదుపులోకి రాలేదని రైతుల ఆవేదనవ్యక్తం చేస్తుంటే ఉన్న కుంకీలకు మేత, ఆహారం కోసం అటవీశాఖకు మరింత భారంగా మారింది. ఇక్కడి క్యాంపు నిర్వహణకు నెలకు రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి రేంజ్‌లోని సిబ్బంది కుంకీ పనుల్లోనే బిజీగా మారిపోయారు. కుంకీ క్యాంపును పరిశీలించేందుకు వస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఈ ప్రాంతంలో ఏనుగుల సమస్యను పూర్తిగా పరిష్కరించే అంశంపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
ఎలిఫెంట్ క్యాంపులోని ఏనుగులు
కుంకీ ఏనుగుల ద్వారా ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కుంకీ ఆపరేషన్‌లు గత కొన్నేళ్లుగా జరుగుతున్నా యి. అక్కడ విజయవంతం కావడంతో కూటమి ప్రభుత్వం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు దుబేరా బేస్ క్యాంపు నుంచి నాలుగు కుంకీ ఏనుగులు, రామకుప్పం ననియాల నుంచి రెండు ఏనుగులను తెప్పించారు. వీటికి ఈ ప్రాంతాన్ని అలవాటు చేసి ఆపై అడవిలోని ఏనుగులను కట్టడి చేయాలి. ఇందులో అత్యంత ముఖ్యమైన పని క్యాప్చరింగ్. అంటే మదపుటేనుగులను గుర్తించి వాటికి మత్తుచ్చి కుంకీల సాయంతో క్యాంపునకు తీసుకొచ్చి ఇక్కడి ఎలిఫెంట్ క్రాల్స్‌లో బంధించాలి. ఆపై వీటికి ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తే అవి కుంకీలగా మారి డాడులు చేయకుండా మాట వింటాయి. ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు.
ఇంకా సమయం పడుతుంది
కుంకీల ద్వారా క్యాప్చరింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇందుకు కొంత సమయంపడుతుంది. జిల్లాలోని పలు చోట్ల ఏనుగుల గుంపులు ఎక్కువగా ఉన్నాయి. మూడు నాలుగు కుంకీలు వాటిని నియంత్రించడం కష్టం. మావటీల ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి ఓ ప్రణాళిక మేరకు ఏనుగుల కదలికలును గమనిస్తూ ఆపై క్యాప్చరింగ్ చేసే అవకాశాలున్నాయి.
– సుబ్బరాజు, చిత్తూరు డీఎఫ్వో
కుంకీల లక్ష్యం ఇదీ!
కుంకీల లక్ష్యం ఇదీ!
కుంకీల లక్ష్యం ఇదీ!
కుంకీల లక్ష్యం ఇదీ!
కుంకీల లక్ష్యం ఇదీ!
కుంకీల లక్ష్యం ఇదీ!


