న్యాయం గెలిచింది! | - | Sakshi
Sakshi News home page

న్యాయం గెలిచింది!

Sep 30 2025 7:35 AM | Updated on Sep 30 2025 7:35 AM

న్యాయ

న్యాయం గెలిచింది!

● ఎంపీ మిథున్‌కు బెయిల్‌పై సంబరాలు ● జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన కార్యక్రమాలు ● కూటమి అక్రమ అరెస్ట్‌లకు భయపడమంటూ నినాదాలు

పుంగనూరు: అక్రమ మద్యం కేసులో అరెస్టయిన ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్‌ రావడంపై జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కూటమి కుట్రలు, కుతంత్రాలకు కోర్టులు కళ్లెం వేస్తున్నాయని, న్యాయపోరాటంలో అంతిమ విజ యం మిథున్‌ అన్నదే అని నినాదాలు మిన్నంటించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మైనారిటీ సెల్‌ ఇన్‌చార్జ్‌ ఫకృద్దీన్‌షరీఫ్‌, పుంగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మిథున్‌రెడ్డి యువసేన అధ్యక్షుడు రాజేష్‌ ల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. సోమ వారం ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై పట్టణంలోని బస్టాండ్‌లో గల రాజన్న విగ్రహం వద్ద అభిమానులు మిఠాయిలకు పంపిణీ చేశారు. అలాగే ఇందిరా సర్కిల్‌లో బాణసంచా పేల్చారు. పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్‌, పట్టణ బలిజ సంఘ నాయకుడు కొండవీటి నరేష్‌, కౌన్సిలర్‌ కాళిదాసు, నాయకులు అజ్ము, గౌసి, నూర్‌, మమ్ము, అస్లాంమురాధి, నజీ ర్‌, అఫ్సర్‌, జావీద్‌, బావాజాన్‌, జవహార్‌, సిద్ధిక్‌, ఆయాజ్‌, నయాజ్‌, జిమ్‌ ఇర్ఫాన్‌, అజిజ్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ సంబరాలు

పులిచెర్ల(కల్లూరు): ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్‌ రావడంపై మండలంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. న్యాయం గెలిచిందన్నారు. మండల కన్వీనర్‌ నాదమునిరెడ్డి, మాజీ జిల్లా ప్రింటింగ్‌ ప్రెస్‌ చైర్మన్‌ గోటూరి మురళీమోహన్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ రెడ్డి ప్రకాష్‌, మువ్వల నరశింహులుశెట్టి, రెడ్డి అహమ్మద్‌, నిరంజన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, రాయల్‌మోహన్‌, గోవిందరెడ్డి, సౌకత్‌, మునస్వామి, మునీశ్వర, విజయకుమార్‌, శ్రీనివాసులు, మునీర్‌ఖాన్‌, కోదండ సైదుల్లా, అమీన్‌, రాజారెడ్డి, దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు.

కల్లూరు: సంబరాలు చేసుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు

పుంగనూరు: స్వీట్లు పంపిణీ చేస్తున్న నేతలు

మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా వస్తారు

చిత్తూరు అర్బన్‌: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి న్యాయస్థానం బెయిల్‌ ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త హర్షం వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పారు. కూటమి చేసే ప్రతి తప్పులను జగన్‌మోహన్‌రెడ్డి లెక్కిస్తూనే ఉన్నారన్నారు.

న్యాయం గెలిచింది! 1
1/2

న్యాయం గెలిచింది!

న్యాయం గెలిచింది! 2
2/2

న్యాయం గెలిచింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement