
పట్టాలు తప్పిన రైలు ఇంజిన్
పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు మండలం, కొత్తకోట పంచాయతీ పరిధిలోని మోటకంపల్లి వద్ద రైల్వే విద్యుత్ లైన్లు తనిఖీ చేసే రైలింజిన్ అదుపుతప్పింది. వివరాలు.. సోమ వారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చిత్తూరు–తిరుపతి రైల్వే మార్గంలో విద్యుత్ లైన్ల పరిశీలన నిమిత్తం ఓ ఈహెచ్‌ఈ ఇన్‌ఫెక్షన్ కారు వెళ్తోంది. ఇంజిన్ నడుపుతున్న లోకోపైలెట్ అజాగ్రత్త వల్ల పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కాగా ఈ ఘట న కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విధి లేని పరిస్థితుల్లో దారి మళ్లించారు. రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరు కుని మరమ్మతులు చేయిస్తున్నారు.
శిక్షణకు హాజరుకావాల్సిందే
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెగా డీఎస్సీకి ఎంపికై న నూతన టీచర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాల్సిందేనని డీఈవో వరలక్ష్మి చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో డీఎస్సీలో ఎంపికై న నూతన టీచర్లకు అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు అక్టోబర్ 3 ఉదయం 7 గంటలకు తమకు కేటాయించిన శిక్షణ కేందాల్లో హాజరుకావాలన్నారు. వంద శాతం హాజరు తప్పనిసరి అన్నారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్, అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లను తీసుకురావాలన్నారు. చిత్తూరు జిల్లాలోని ఎస్వీ ఫార్మసీ (ఆర్వీఎస్ నగర్, చిత్తూరు), ఆర్‌కే పాఠశాల (కట్ట మంచి, చిత్తూరు), ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ (చిగురువాడ, తిరుపతి), విశ్వం స్కూల్ (జీవకోన, తిరుపతి), మెడ్జీ స్కూల్ (తిరుపతి), ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల (బైపాస్‌రోడ్డు, గూడూ రు)లో శిక్షణ ఉంటుందని డీఈవో వెల్లడించారు.

పట్టాలు తప్పిన రైలు ఇంజిన్