
ఇన్ని నిబంధనలా?
వైద్య వృత్తిలో ఎదుగుదల లేదంటే పీజీ చదవడం దేనికని పీహెచ్‌సీల వైద్యులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలో చేరే ఉద్యోగికి కూడా ఇన్ని షరతులు ఉండవని వాపోతున్నారు. ఈ నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యాధికారులకు 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. వారికి పదోన్నతులిస్తామని ఎన్నికల వేళ అసోసియేషన్ నాయకులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ వేళ అత్యవసర పరిస్థితిలో చేరి, ప్రాణాలకు తెగించి మరీ రోగులకు వైద్య సేవలందించిన తమపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.