
మహాచండీగా బోయకొండ గంగమ్మ
దసరా మహోత్సవాల్లో భాగంగా ఆరవరోజైన ఆదివారం బోయకొండ గంగమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. భక్తుల పాలిట వరాలిచ్చే కొంగు బంగారంగా అమ్మవారు ప్రసిద్ధికెక్కారు. అమ్మవారిని పట్టుపీతాంబరాలు, రంగు రంగులపూలు, స్వర్ణాభరణాలతో శత్రు సంహారి మహాచండీ దేవిగా కొలువుదీర్చారు. అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరంతో పాటు ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలతో పాటు పూర్ణాహుతి చేశారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. – చౌడేపల్లె

మహాచండీగా బోయకొండ గంగమ్మ