కిక్కిరిసిన కొండ | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన కొండ

Sep 29 2025 8:08 AM | Updated on Sep 29 2025 8:08 AM

కిక్క

కిక్కిరిసిన కొండ

సాయంత్రం 6 గంటల నుంచే వాహన సేవ ప్రారంభం ఉదయం మోహినీ అవతారంలో మలయప్ప దర్శనం శ్రీవారికి అత్యంత ఇష్టుడైన గరుడుని అధిరోహించి కటాక్షం జగద్రక్షుడ్ని కనులారా వీక్షించి పులకించిన భక్తజనం భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండ నేటి స్వర్ణరథోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

గరుడ వాహన సేవ కోసం భక్తులు పోటెత్తారు. తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు పడ్డారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులే ఎక్కడికక్కడ గరుడ వాహన సేవ కోసం నిరీక్షించారు. రెండు లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధం చేసిన గ్యాలరీలు మధ్యాహ్నం ఒంటి గంటకే నిండిపోయాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇలా రెండోసారి భర్తీ చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.

సంప్రదాయ నృత్య ప్రదర్శనలో కళాకారులు

తిరుమల : అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం జగద్రక్షకుడైన శ్రీ వేంకటేశ్వరుడు మోహినీ రూపంలో దంత పల్లకీపై శృంగార రసాధి దేవతగా, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్ని కృష్ణుడితో కలసి హోయ లొలుకుతూ భక్తకోటిని సాక్షాత్కరించారు.

కట్టుదిట్టమైన భద్రత

తమిళనాడు ఘటన నేపథ్యంలో పోలీసులు, అధికారులు తిరుమల భద్రతను మరింత పెంచారు. గరుడ వాహన సేవలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ సుబ్బరాయుడు పటిష్ట భద్రతను కల్పించారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను గ్యాలరీల్లోకి అనుమతించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయ వీధుల్లోకి రాకుండా కట్టడి చేశారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, ఆలయ సిబ్బంది అప్రమత్తతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించారు. ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల అనుమతి లేకపోవడంతో భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీల్లో తిరుమలకు రావాల్సి వచ్చింది.

గరుడోత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శన

మురుగన్‌ వేషధారణ

భక్తులను నియంత్రిస్తున్న పోలీసులు

బారులు తీరిన వాహనాలు

వైభవంగా శ్రీవారి గరుడ సేవ

కిక్కిరిసిన కొండ 
1
1/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
2
2/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
3
3/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
4
4/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
5
5/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
6
6/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
7
7/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
8
8/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
9
9/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
10
10/11

కిక్కిరిసిన కొండ

కిక్కిరిసిన కొండ 
11
11/11

కిక్కిరిసిన కొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement