కాసుల‘గుట్టలు’ | - | Sakshi
Sakshi News home page

కాసుల‘గుట్టలు’

Sep 28 2025 7:22 AM | Updated on Sep 28 2025 7:22 AM

కాసుల

కాసుల‘గుట్టలు’

మైనింగ్‌ అనుమతులకు తూట్లు ప్రజాప్రతినిధుల అనుమతితో వెలుస్తున్న క్వారీలు ప్రతిఫలంగా రూ.లక్షలు ముట్టజెబుతున్న వైనం చోద్యం చూస్తున్న మైనింగ్‌ శాఖ అధికారులు దొంగ బిల్లుల వ్యవహారం సీఎం చెంతకు? చర్యలు తీసుకునేనా?

జిల్లాలో అక్రమ క్వారీలు సవారీ చేస్తున్నాయి. మైనింగ్‌ అనుమతులకు తూట్లు పొడుస్తున్నారు. కూటమి నేతలు కసితీరా గుట్టలను కొల్లగొట్టి దోచేస్తున్నారు. అక్రమాలకు కూటమిలో ని కొందరు బడా నేతలు, ప్రజాప్రతినిధులు బ్రాండ్‌ అంబాసి డర్లుగా నిలిచారు. వీరిచ్చే అనుమతులకు ప్రతిఫలంగా లక్ష లు జేబులోకి వెళ్తోంది. దీనిపై మైనింగ్‌ శాఖ అధికారులు చో ద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలోని సీనియర్‌ నేతలు మైనింగ్‌ మాఫియా విషయాన్ని సీఎం చెంతకు తీసుకెళ్లారనే విషయం జిల్లాలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : జిల్లాలో 400 వరకు క్వారీలకు అనుమతులున్నాయి. వీటిలో చాలా క్వారీలు జోరుగా నడుస్తున్నాయి. ఇందులో 200 క్వారీలు కాసులు కుమ్మరిస్తున్నాయి. మిగిలిన వాటిలో కొన్ని నాసిరకం, క్రాక్‌లు, ఆర్థిక కష్టాల కారణంగా నిలిచాయి. మరికొన్ని మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. అయితే దీనికి దీటుగా అక్రమ క్వారీలు వెలుస్తున్నాయి. చిత్తూరు, గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం, పాలసముద్రం, కుప్పం, ఎస్‌ఆర్‌పురం, యాదమరి, జీడీనెల్లూరులో విచ్చలవిడిగా కొండలు ఛిద్రమవుతున్నాయి. బంగారుపాళ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టి ఎత్తులు వేశారు. దీంతో అక్కడ నల్లబంగారమే అక్రమ గనులకు రూ.కోట్లు తెచ్చి పెడుతున్నాయి.

అనుమతులు ఇలా....

క్వారీ నడపాలంటే తొలుత మైనింగ్‌ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ, అటవీశాఖ అధికారుల నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. ఆ దరఖాస్తు మేరకు మైనింగ్‌ శాఖ అధికారులు సర్వే చేసి విజయవాడకు పంపుతారు. దీంతో అక్కడి నుంచి ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌) వస్తుంది. అనంతరం మైనింగ్‌ ఫ్లానింగ్‌, ఈసీ, పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డైర్‌క్టర్‌ నుంచి తదుపరి అనుమతులు వస్తాయి. డీడీకి గ్రాంట్‌ ఆర్డర్‌ వచ్చాక , సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి. ఈ చెల్లింపుతో వర్క్‌ ఆర్డర్‌ ఇస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేందుకు కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల సమయం పడుతుంది.

మామూళ్లు రూ.లక్షల్లో చేరిపోతున్నాయి

మైనింగ్‌ శాఖ చుట్టూ తిరగకుండా కొంత మంది కూటమి నేతలు అధికారపార్టీ బలాన్ని కొండలపై పెడుతున్నారు. మైనింగ్‌ శాఖ చట్టానికి, అనుమతులకు తూట్లు పొడుస్తున్నారు. కొందరు బడానేతలు, ప్రజాప్రతినిధుల నోటి మాటలే అనుమతులుగా మలిచి క్వారీలపై సవారీ చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇందుకు ప్రతి ఫలంగా కొందరు ప్రజాప్రతినిధులు, బడానేతలకు రూ. లక్షల్లో క్వారీ కాసులు చేరుతున్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. క్వారీలో అడుగు పెట్టాలంటే రూ. 5 నుంచి రూ. 10 లక్షలు, రాళ్లు బయటపడితే నెలవారీ మామూళ్లు రూ. 20 నుంచి రూ. 30 లక్షల వరకు వెళుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఓ మంత్రి పేరు సైతం వాడేస్తున్నారని ఆగ్రహానికి లోనవుతున్నారు. అడ్డొచ్చే వారికి, ఈ అక్రమ క్వారీల విషయాన్ని బయట పొక్కకుండా కాపాడేందుకు వివిధ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు పంపుతున్నామని అక్రమ క్వారీ నిర్వాహకులు బహిరంగంగా చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రతిఫలంగా అధికారులు అక్రమ క్వారీ నిర్వాహకులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని టీడీపీలోని ఓ వర్గం నేతలు గొంతు చించుకుంటున్నారు. అక్రమంపై ఫిర్యాదు చేస్తే.. ఆ కార్వీలకు దరఖాస్తులు పెట్టుకున్నారని అధికారులు తోసి పుచ్చుతున్నట్లు వారు మండిపడుతున్నారు. అక్రమ క్వారీ వ్యవహారంపై కలెక్టర్‌కు కూడా మైనింగ్‌ అధికారులు తప్పుడు నివేదికలు పంపుతున్నారని వాదిస్తున్నారు.

అనుతులుంటే నష్టపోతున్నారు..

అక్రమ క్వారీలతో పక్కాగా అనుమతులు తీసుకుని క్వారీలు నడిపిస్తున్న వారు నష్టపోతున్నారు. అక్రమ క్వారీలకు గిరాకీ పెరగడంతో వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. అక్రమ గ్రానైట్‌ తక్కువ రేటుకు లభించడంతో అక్రమ క్వారీలకు క్యూ కడుతున్నారు. అక్కడ తక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ...అనుమతులతో నడిపిస్తున్న క్వారీపై పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. అక్రమ క్వారీ నిర్వాహకులు గ్రానైట్‌ తరలింపునకు దొంగ బిల్లులు అంటగడుతూ..గ్రానైట్‌ ఫ్యాక్టరీ నిర్వాహకులను బుట్టలో వేసుకుంటున్నారని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. దీని దెబ్బకు అనుమతులతో క్వారీ నడిపిస్తున్న వారు ఏకమయ్యారు. అక్రమ క్వారీలతో తమ కడుపు కాలుతోందని..వారంతా రాష్ట్ర నేతల వద్ద గోడు వెలబోసుకుంటున్నారు.

దొంగబిల్లుల రచ్చ...

చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న దొంగ బిల్లుల వ్యవహారం రచ్చ కెక్కింది. ఈ వ్యవహారానికి మూల పురుషుడుగా రారాజేనని కూటమి నేతలు ముద్రవేశారు. సాక్షిలో వచ్చిన వరుస కథనాలను టీడీపీలోని నేతలే నిజమని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి చేరినట్లు ఓ వర్గం కోడై కూస్తోంది. ఈ విషయాన్ని తొక్కే పడేయాలని కొందరు అధికారులు, రారాజు వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని వ్యతిరేక వర్గం చెబుతోంది. ఈ వ్యవహారంపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

బంగారుపాళెం మండలంలో నడుస్త్తున్న అక్రమ క్వారీలు

జిల్లాలో ఆగని అక్రమ క్వారీలు

కాసుల‘గుట్టలు’ 1
1/1

కాసుల‘గుట్టలు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement