
టీటీడీకి 12 టన్నుల కూరగాయల వితరణ
పలమనేరు : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలోని గంటావూరుకు చెందిన శ్రీవారి భక్తుడు మురుగన్ 12 టన్నుల కూరగాయలను టీటీడీ అన్నదాన సత్రానికి శనివారం వితరణ చేశారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీవారి సేవకులు కాబ్బల్లి రవీంద్రారెడ్డి దాతను అభినందించారు. ఆ మేరకు కూరగాయలు నింపిన ప్రత్యేక వాహనానికి పూజలు నిర్వహించి గోవింద నామస్మరణాల మధ్య తిరుమలకు ఇక్కడి నుంచి తరలించారు.
ప్రసవాల సంఖ్య పెంచాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీలో వంద శాతం గర్భిణుల నమోదు చేపట్టాలని, అలాగే ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 12 వారాలకే గర్భిణుల నమోదు చేయాలన్నారు. ఇప్పటికి 80 శాతం మాత్రమే పూర్తి అయ్యిందన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలకు ఆధార్ కార్డుతో అనుసంధానం ఉందా లేదా అని పరిశీలించాలన్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో సుధారాణి, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి పాల్గొన్నారు.

టీటీడీకి 12 టన్నుల కూరగాయల వితరణ