
లోన్ మంజూరైందంటూ ఘరానా మోసం
చౌడేపల్లె : ఫోన్ చేసి హలో.. మీకు రూ.5 లక్షల లోన్ మంజూరైందని మాటలతో బురిడీ కొట్టి రూ.50 వేలు సొమ్ము కాజేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు ఇలా.. చౌడేపల్లె మండలం 29 ఏ చింతమాకులపల్లెకు చెందిన డి. కృష్ణప్ప కుమారుడు రవికి శుక్రవారం 8601605396 నంబరుతో ఫోన్‌లో ‘ధని ప్రవేటు పైనాన్స్ కంపెనీ మేనేజరు విజయరావు మాట్లాడుతున్న.. మీకు లోన్ మంజూరైంది, అది జమ కావాలంటే తొలుత కొంత సొమ్ము చెల్లించాలని కోరాడు’. రవిని నమ్మించడానికి విజయరావు పైనాన్స్ మేనేజరు ఐడీ , ఆధార్ కార్డులను వాట్సాప్‌నకు పంపించడంతో నిజమేనని నమ్మిన రవి తొలుత రూ.20 వేలు, తరువాత రూ.30 వేలు చెల్లించేశాడు. ఎంతసేపటికీ తనకు రూ.5 లక్షలు లోన్ సొమ్ము ఖాతాకు జమ కాకపోవడం, తనకు వచ్చిన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయాయని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నాడు. చివరికి ఇది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించి పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిపాడు.
ధని పైనాన్స్ మేనేజరుగా పంపిన విజయరావు గుర్తింపు కార్డు, ఆధార్

లోన్ మంజూరైందంటూ ఘరానా మోసం