
కిక్కిరిసిన గోవిందరాజులగుట్ట
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పెరటాసి నెలను పురస్కరించుకుని చిత్తూరు మండలం టి.వేపనపల్లి సమీపంలోని గోవిందరాజుల గుట్టకు శనివారం జనం పోటెత్తారు. గుట్టలోని శ్రీవారి పాదాలకు క్షీరాభిషేకం చేశారు. చుట్టూ పక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో తాళంబేడు సర్పంచ్ అమర్‌నాథ్‌రెడ్డి, సభ్యులు సోమనాథరెడ్డి, నందగోపాల్‌నాయుడు, మధుబాబు, గోవిందరాయుడు, శ్రీరాములు, నీరాజాక్షులునాయుడు, అర్చకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరు నగరంలోని శ్రీవేంకటేశ్వస్వామి ఆలయంలో కూడా భక్తులు కిక్కిరిశారు. గోవింద నామస్మరణలతో మార్మోగించారు. అనంతరం స్వామివారిని నగర వీధుల్లో ఊరేగించారు.