
ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల (కల్లూరు) : పంట పొలాలపై ఏనుగుల దాడి నిరంతరం కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం తెల్లవారుజామున మండలంలోని దిగువమూర్తి వారిపల్లె, మిట్టమీద రాచపల్లె, మర్రి కుంట వారిపల్లె, పాళెం, కొంగరవారిపల్లె గ్రామాల్లోని పొలాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. మిట్టమీద రాచపల్లెకు చెందిన సుధాకర్, ప్రభాకర్ పొలాల్లో వరి పంటను తొక్కి నాశనం చేశాయి. అలాగే కృష్ణారెడ్డికి చెందిన టమాట పంటను ధ్వంసం చేశాయి. దిగవ మూర్తి వారిపల్లెకు చెందిన సుధాకర్ పొలంలో మామిడితోటలో కొమ్మలను విరిచేశాయి. ఏనుగులు రాత్రి సమయంలో చుట్టు పక్కల పొలాలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.