
ముత్యాల మురిపెం
సింహాసన యోగం..
ధనలక్ష్మీ
నమోస్తుతే
ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో ధనలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉభయదారులు, ఈఓ ఏకాంబరం పాల్గొన్నారు.
– చౌడేపల్లె
ఇల వైకుంఠంగా అలరారుతున్న తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామి శుక్రవారం ఉదయం సింహ వాహనంపై యోగ నృసింహుడి రూపంలో దర్శనమిచ్చారు. రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు కటాక్షించారు. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. – తిరుమల

ముత్యాల మురిపెం

ముత్యాల మురిపెం