
పీఈఎస్ విద్యాసంస్థలపై ఐటీ దాడులు
కుప్పం: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పీఈఎస్ యూనివర్సిటీ విద్యాసంస్థలపై ఐటీ శాఖ అధికాలు దాడులు నిర్వహించారు. కుప్పం పట్టణ సమీపంలోని పీఈఎస్ వైద్య కళాశాలలో మూడు రోజులుగా తమిళనాడు రాష్ట్రం, చైన్నెకి చెందిన 12 మందితో కూడిన ఆదాయ పన్నుశాఖ అధికార బృదం ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. శుక్రవారం పీఈఎస్ మెడికల్ కళాశాల మెయిన్ గేట్‌ను మూసివేసి, ఎంట్రాన్స్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవ్వరినీ లోనికి అనుమతించలేదు. కళాశాలలో పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని లోనికి అనుమతించారు. ఇప్పటికే బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీలో ఐటీ దాడులు జరిగిన విషయం విధితమే.
పంటలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట పంటలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని పాళెం, దేవళంపేట పంచాయతీల్లో పంట పొలాలను నాశనం చేశాయి. దాదాపు పది మంది రైతులకు సంబంధించిన పంటలను తొక్కిపడేశాయి. పాళెం పంచాయతీతోపాటు దేవళంపేట పంచాయతీలోని దిగవమూర్తివారిపల్లె, మర్రికుంటవారిపల్లె, బాలిరెడ్డిగారిపల్లె గ్రామాల్లో మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. మామిడి తోపునకు అమర్చిన ఇనుప గేటును గొడతో సహా పెకళించివేశాయి. తిరిగి సమీపంలోని చింతల వంకకు చేరు కున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి పంటలను రక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

పీఈఎస్ విద్యాసంస్థలపై ఐటీ దాడులు