
మా భూమిని ఆక్రమిస్తున్నారయ్యా!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తమ అనుభవంలోని రెండెకరాల భూమిని టీడీపీ యాదమరి మండల అధ్యక్షుడు మురార్జీ, కార్యకర్త కుప్పయ్యమందడి ఆక్రమిస్తున్నారని అదే మండలం, రసూల్ నగర్ ఏఏడబ్ల్యూ కాలనీకి చెందిన బుజ్జి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. యాదమరి తహసీల్దార్ అండతో అక్రమార్కులు తప్పుడు రికార్డులు సృష్టించి తమను వేధిస్తున్నారని ఆవేదన చెందారు. తమ భూమిలోని టేకు, మామిడి చెట్లను తొలగించారని.. ప్రశ్నించిన తమను కులం పేరుతో దూషించారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తమపై తప్పుడు కేసు పెడుతామని అధికారులు, టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ బతకులు రోడ్డు పాలు చేస్తున్న మురార్జీ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
గుడుపల్లె: వ్యవసా య పొలం వద్ద కరెంట్ షాక్‌కు గురై వేలు (40) అనే వ్యక్తి శుక్ర వారం మృతి చెందా డు. బంధువుల కథనం.. మండలంలోని కంచిబందార్లపల్లె గ్రామానికి చెందిన వేలు తన పొలం వద్ద ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ బావి వద్ద ఉన్న స్టార్టర్‌లోని స్వీచ్ వేసేందుకు వెళ్తుండగా కరెంట్ వైరు తగిలి షాక్‌కు గురయ్యా డు. స్థానికులు అతన్ని కుప్పం ఆస్పత్రికి తరలి స్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు.
గ్రానైట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం
చిత్తూరు అర్బన్: జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీల సంఘం నాయకుడు, చిత్తూరుకు చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి శేఖర్ నాయుడు శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన శేఖర్‌నాయుడుకు పలు క్వారీలు, గ్రానై ట్ ఫ్యాక్టరీలు ఉన్నా యి. దీంతోపాటు కొన్ని క్వారీలను లీజుకు తీసుకొని నడిపిస్తున్నాడు. శుక్రవారం రాత్రి చిత్తూరు మండలంలోని సిద్ధంపల్లె వద్ద కు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అప్పటికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న శేఖర్నాయుడు తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి పడిపోయాడు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గరుడసేవ నాడు ద్విచక్ర
వాహనాల రాకపోకలు రద్దు
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 28న గరుడ సేవ నాడు విశేషంగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 27న సాయంత్రం 6 గంటల నుంచి సెప్టెంబరు 28 ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పిస్తోంది.

మా భూమిని ఆక్రమిస్తున్నారయ్యా!

మా భూమిని ఆక్రమిస్తున్నారయ్యా!