
బంగారుపాళెంలో అగ్ని ప్రమాదం
ఇంట్లో కాలిపోయిన వస్తువులు
ఇంట్లో నుంచి వస్తున్న పొగ
బంగారుపాళెం: మండల కేంద్రమైన బంగారుపాళెంలో శుక్రవారం సాయంత్రం ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.5 లక్షల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. మండలంలోని మొగిలి వెంకటగిరి గ్రామానికి చెందిన నాగరాజ బంగారుపాళెంలో వినాయక టెక్స్‌టైల్స్ దుకాణాన్ని నిర్వహింస్తున్నాడు. పాత తాలూకా వీధిలో సొంత గృహాన్ని నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లాడు. సాయంత్రం ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చుట్టుపక్కల వారు గుర్తించారు. స్థానికులు పోలీసులకు, విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇంటి తలుపులు, కిటికీలు పగులగొట్టి మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక సిబ్బంది బంగారుపాళ్యానికి చేరుకుని మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

బంగారుపాళెంలో అగ్ని ప్రమాదం