
క్రీడలతో ఉజ్వల భవిత
చిత్తూరు కలెక్టరేట్ : క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఓటమి పొందిన సమయంలో కుంగిపోకుండా తిరిగి పోటీల్లో రాణించేలా ప్రయత్నం చేయాలన్నారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చందు మాట్లాడుతూ క్రీడల్లో మంచి పుణ్యం ప్రదర్శిస్తే క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడవచ్చన్నారు. జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో ఎంపికై న జట్లకు అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో విశాఖపట్టణం జిల్లా నర్సీపట్టణంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన జట్లను అభినందించారు. అనంతరం ఉచితంగా క్రీడాదుస్తులు అందజేశారు. ఫిజికల్ డైరెక్టర్‌లు దేవానంద్, నూరుద్దీన్, కృష్ణా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.