
మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి
చిత్తూరు కలెక్టరేట్ : మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి అభివృద్ధి చెందేందుకు చర్యలు చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ కార్యాలయంలో జిల్లా సమాఖ్య ప్రతినిధులకు జెండర్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పీడీ మాట్లాడుతూ హింస లేని కుటుంబాలే లక్ష్యంగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ సిబ్బంది కృషి చేయాలన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అయితే సంఘాల్లో ఉన్న మహిళలకు ఆర్థిక వనరులు అందుకుంటున్న కుటుంబాల్లో హింస కారణంగా వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. సమావేశంలో వయోజన విద్యాశాఖ డీడీ మహమ్మద్ ఆజాద్, డీపీఎం మంజుల, ఏపీఎంలు మధు, సుబ్బారెడ్డి, హేమ పాల్గొన్నారు.